Cooking oil: నకిలీ వంట నూనెలను గుర్తించడం ఎలా? ఇవిగో ఈ చిట్కాలు మీ కోసమే!

మనం వాడుతున్న వంట నూనె ( COOKING OIL) స్వచ్ఛమైనదా లేదా కల్తీదా అనేది ఎలా తెలుసుకోవాలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FASSI) తెలిపింది.

Cooking oil: నకిలీ వంట నూనెలను గుర్తించడం ఎలా? ఇవిగో ఈ చిట్కాలు మీ కోసమే!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆయిల్( OIL) లో ఇప్పుడు వందల బ్రాండ్లు..ఏది మంచిది...ఏ ఆయిల్ వాడితే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు...ఏ ఆయిల్ పిల్లలకు మంచిది..తెలుసుకున్నా..బడ్జెట్ సహాకరించక లైట్ తీసుకుంటాం. కాని మన బడ్జెట్ లో మంచి ఆయిల్ ఏదో...అసలు మంచి నూనెలు ఏంటో ..కూడా తెలుసుకోవాలి కదా.

మనం వాడుతున్న వంట నూనె ( COOKING OIL) స్వచ్ఛమైనదా లేదా కల్తీదా అనేది ఎలా తెలుసుకోవాలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FASSI) తెలిపింది. అసలు నూనెలు కొనేటపుడు కొన్ని చెక్ చేసుకుంటే బెస్ట్ ఆయిల్ ను మీరు కూడా ఛూజ్ చేసుకోవచ్చు.

* పోషకాహార ప్రొఫైల్‌ను చెక్ చేయండి.

*ఆర్గానిక్( ORGANIC), నాన్-GMOలను పరిశీలించండి.

* డేట్ చెక్ చేసుకొండి..ఆయిల్ లో ఎక్స్ పెయిర్ అయ్యిందేమో చెక్ చేసుకొండి.

* తక్కువ ధరకు వచ్చే నూనెను సెలక్ట్ చేసుకోకండి. అవి కల్తీ( FAKE OILS) అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

* అసలైన నూనెలు స్వచ్ఛమైన వాసన స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఆర్గానిక్ అని ఆయిల్ కొంటుంటే మీకు ఆ ఫ్లేవర్ వాసన వస్తుందేమో చూడండి.

* సహజమైన రుచిని కలిగి ఉంటాయి. నకిలీ అయితే రుచిలో తేడా ఉంటుంది.

*నూనె చల్లని ప్రదేశంలో ఉంటే గట్టిగా అయిపోతుంది. అలా అవ్వలేదంటే ఖచ్చితంగా కల్తీ నూనె అని అర్ధం.

పురుగు మందుల అవశేషాలు లేదా పారిశ్రామిక రసాయనాలు వంటి విషపూరిత కలుషితాలు కాలేయం, మూత్రపిండాలు, నాడీ సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనపరుస్తాయి.ఈ కల్తీ నూనెలు వల్లే గుండె జబ్బులు , క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.

Tags:
Next Story
Share it