Dengue Fever Vaccine : ప్రీ క్వాలిఫై అయిన డెంగ్యూ వాక్సిన్..

డెంగ్యూ (Dengue)జ్వరంతో సరైన చికిత్స లేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి కోల్పోతున్న కేసులు చాలా ఉన్నాయి.

Dengue Fever Vaccine : ప్రీ క్వాలిఫై అయిన డెంగ్యూ వాక్సిన్..
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: డెంగ్యూ (Dengue)జ్వరంతో సరైన చికిత్స లేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి కోల్పోతున్న కేసులు చాలా ఉన్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ కోసం జరుపుతున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. మెడిసిన్ కోసం డాక్టర్లు చేస్తున్న కృషి ఫలించేలా ఉంది.

దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో డెంగ్యూ జ్వరం( Dengue fever) ఒకటి. అందులోను డెంగ్యూ వైరస్( virus) ​ రెండోసారి సోకితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అది ప్రాణాలను హరిస్తుంది. అధిక జ్వరం( heavy fever) , దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పుల వంటి లక్షణాలు డెంగ్యూలో ఎక్కువగా కనిపిస్తాయి. మనం కాస్త తెలుసుకునే లోపే ప్లేట్ లెట్స్ ను తినేస్తుంది. కన్ను మూసి తెరిచే లోపు మనిషి ప్రాణాన్ని లాగేసుకుంటుంది.

డెంగ్యూ అనేది దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దోమల నివారణలు చేయాలి. అయితే ఇదే కాకుండా డెంగ్యూ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్​ను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు పరిశోధకులు. తాజాగా ఈ వ్యాక్సిన్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫై చేసింది. డెంగ్యూ వ్యాక్సిన్​లకు ప్రీక్వాలిఫికేషన్​ (pre qualify)అనేది ముఖ్యమైన దశ. తాజాగా TAK-003 వ్యాక్సిన్​ను.. WHO ప్రిక్వాలిఫై చేసింది. WHO నుంచి ప్రీక్వాలిఫై అయిన రెండో డెంగ్యూ వ్యాక్సిన్ ఇది. ఈ వ్యాక్సిన్​ డెంగ్యూకి కారణమయ్యే వైరస్​ను బలహీనపరుస్తుంది. దీని వల్ల సగం డెంగ్యూ కేసుల్ని సీరియస్ నుంచి సేఫ్ కు తీసుకురావచ్చు.

6 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు TAK-003ని ఉపయోగించవచ్చని WHO సిఫార్సు చేసింది. వ్యాక్సిన్​ను 2 డోస్​లుగా ఇవ్వాలని.. మొదటి వ్యాక్సిన్​కు, రెండో వ్యాక్సిన్​కు 3 నెలల విరామంతో నిర్వహించాలని కూడా తెలిపింది. అతి త్వరలోనే డెంగ్యూ వాక్సిన్స్ ను మార్కెట్లో తెచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు.

Tags:
Next Story
Share it