Hair fall: మీ బట్టతలకు అదే కారణమా ?

పాపం కుర్రాళ్లను చూస్తే జాలేస్తుంది. నిండా పాతికేళ్లు రాకుండానే తల మీద వెంట్రుకలు ఖాళీ అయిపోతున్నాయి. లేదా తెల్లబడిపోతున్నాయి.

Hair fall: మీ బట్టతలకు అదే కారణమా ?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాపం కుర్రాళ్లను చూస్తే జాలేస్తుంది. నిండా పాతికేళ్లు రాకుండానే తల మీద వెంట్రుకలు ఖాళీ అయిపోతున్నాయి. లేదా తెల్లబడిపోతున్నాయి. ఆడవాళ్లకి అదే ప్రాబ్లమ్ కాని వాళ్లు ఎలాగో అలా సవరాలు, హెయిర్ ఎక్స్ టెన్షన్స్( HAIR EXTENSION) పెట్టుకొని అడ్జస్ట్ అవుతున్నారు.కాని ఈ మగమహారాజులకు మాత్రం ఈ హెయిర్ లాస్ ( HAIR LOSS)ఎందుకో ఏంటో అర్ధం కాక చస్తున్నారు.

కొందరికి ఒత్తిడి వల్ల, కొందరిలో జెనెటిక్స్ వల్ల, కొందరికి రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల సాధారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. జుట్టు ఊడిపోతుందన్న బెంగతో గంటలు గంటలు ఫోన్లో రెమెడీస్(PHONE REMEDIES) కోసం వెతుకుతున్నారా? జుట్టు ఊడిపోవడానికి ఇదే కారణమట. ఎక్కువ సేపు స్క్రీన్ టైం ఉంటే వారికి బట్టతల వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటున్నాయట. స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ పరోక్షంగా జుట్టు రాలిపోవటానికి, అంతేగాక, రకరకాల ఆరోగ్య సమస్యలకూ ఇదే కారణమవుతోందని మనం గుర్తించాలి. ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది.

ఫోన్ ..ఇదొక అడిక్షన్ లా మారుతోంది. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ స్క్రీన్ లకు అతుక్కుపోతున్నారు. స్క్రీన్ టైం(SCREEN TIME) వల్ల ఇదే సమస్య. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల నిద్రలేమి, స్ట్రెస్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వస్తాయి. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ నేచురల్ స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వల్ల మీ జుట్టే కాదు..శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోతాయి. దీని వల్ల ఊబకాయం..బీపీ..లాంటి ఇబ్బందులు వచ్చేస్తాయి.

Tags:
Next Story
Share it