Indian Boy: ఇండియన్ కుర్రాడి నిజాయతీకి దుబాయ్ పోలీసుల ఫిదా!

ఓ ఫార్నర్ పోగొట్టుకున్న కాస్ట్లీ వాచ్ ను ఆ కుర్రాడు తెచ్చి ఇవ్వడంతో అతన్ని ప్రత్యేకంగా అభినందించారు

Indian Boy: ఇండియన్ కుర్రాడి నిజాయతీకి దుబాయ్ పోలీసుల ఫిదా!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దుబాయ్ ( DUBAI) లో సెటిల్ అయిన ఓ కుర్రాడి నిజాయితీ చూసి దుబాయ్ రాజులు( DUBAI KINGS) తెగ మురిసిపోయారు. ఓ ఫార్నర్ పోగొట్టుకున్న కాస్ట్లీ వాచ్ ను ఆ కుర్రాడు తెచ్చి ఇవ్వడంతో అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. బాలుడికి అవార్డు అందజేశారు. ఈ పిక్స్ ( PICS) ను దుబాయ్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా.

ముహమ్మద్ అయాన్ యూనిస్ ( MOHAMMAD AYAN UNININS)అనే భారతీయ బాలుడి కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రితో కలసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యూనిస్ కు ఓ వాచ్ కనిపించింది. చూస్తుంటే చాలా కాస్ట్లీ అని కూడా అనిపించింది. దాన్ని తీసుకొని సమీపంలోని పోలీసు స్టేషన్ లో( POLICE STATION) అప్పగించాడు. దీనిపై..పోలీసులు ఆరా తీయగా పోగొట్టుకున్న వ్యక్తి సంగతి తెలిసింది.

ఆ దొరికిన వాచ్ ( WATCH) ను నిజాయతీగా అప్పగించినందుకు బాలుడిని ప్రశంసిస్తూ ఓ అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక పోలీసు శాఖ( POLICE DEPARTMENT) కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ముహమ్మద్ అబ్దుల్ రహ్మాన్( ABDUL REHMAN) , కెప్టెన్ షహాబ్ అల్ ( SHEHAB AL SADI) సాదీ పాల్గొన్నారు. యూఏఈ ప్రజలు పాటించే నైతిక విలువలకు, పోలీసులు అమలు చేసే భద్రతా ప్రమాణాలకు ఇదో నిదర్శనమని దుబాయ్ పోలీసు శాఖ ‘ఎక్స్’లో ( X) పేర్కొంది. యూనిస్ నిజాయతీని నెటిజన్లు ప్రశంసించారు.

Tags:
Next Story
Share it