Psychosis with Cannabis : గంజాయి తాగితే సూసైడ్ థాట్స్ పక్కా

ప్రస్తుతం సమాజంలో ..అత్యంత ప్రమాదకరమైన సమస్య మానసిక సమస్యలు.. సమాజంలో చిన్న పెద్ద తేడాలేకుండా ఈ మానసిక సమస్యలు ( MENTAL ISSUES) వెంటాడుతున్నాయి.

Psychosis with Cannabis : గంజాయి తాగితే సూసైడ్ థాట్స్ పక్కా
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ప్రస్తుతం సమాజంలో ..అత్యంత ప్రమాదకరమైన సమస్య మానసిక సమస్యలు.. సమాజంలో చిన్న పెద్ద తేడాలేకుండా ఈ మానసిక సమస్యలు ( MENTAL ISSUES) వెంటాడుతున్నాయి. దీని వల్లే చాలామంది యువత మత్తు( DRUGS) పదార్ధాలకు అలవాటుపడిపోతున్నారు. అసలు గంజాయ్ (GANJA) లాంటి వాటిని వాడడం వల్ల కూడా సూసైడ్ ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తున్నాయంటున్నారు సైంటిస్టులు.

గంజాయి వినియోగాన్ని, పెంపకాన్ని ప్రభుత్వాలు( GOVERNMENT) నిషేదించాయి. కానీ కొందరు గంజాయిని అక్రమంగా స్మగ్లింగ్( SMUGLING) చేస్తారు. ఇప్పుడు యూత్ కి ఇదో ఫ్యాషన్( FASHION) ...ఎలా అందుతుందని అడక్కండి...కావాల్సినంత కావాలనుకున్నపుడు గంజాయి దొరుకుతూనే ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన గంజాయి దీర్ఘకాలిక నొప్పి( PAIN KILLER) నుంచి ఉపశమనం, నాణ్యమైన జీవిత ప్రయోజనాలను అందిస్తుందని పలు అధ్యయనాలు సూచించాయి. ఒకప్పుడు ఈ గంజాయి ఆయుర్వేదంలో( AYURVEDA) వాడేవారు.దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణాంతక సమస్యలు కూడా కలుగుతాయని పురాణ ఆయుర్వేదాలు తెలిపాయి.

ఈ గంజాయి ఎక్కువగా వాడడం వల్ల నొప్పులు రావడమే కాదు...అలసట పెరిగి, తల తిరగడం తో పాటు..తీవ్రమైన మానసిక ఒత్తిడి (STRESS) పెరిగి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంది.గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలియక చాలామంది దీనిని ఎక్కువగా వినియోగించడం మొదలు పెడుతున్నారని.. మోతాదుకు మించి తీసుకుంటే మరణం తప్పదని చెప్తున్నారు. గంజాయి వినియోగం వల్ల జంక్ ఫుడ్ కోరికలు, గణనీయంగా బరువు పెరగడం, ఆందోళన, భయభ్రాంతులు కలగడం వంటి కూడా ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. మీకు గంజాయి రిలాక్సేషన్ అయితే..క్వాంటిటీ పెరిగే కొద్ది చావుకు దగ్గర చేస్తుంది.

Tags:
Next Story
Share it