Gold: ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు, ఐటీ రూల్స్ లో ఏముంది?

2000 రూపాయల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) చెలామణి నుంచి వెనక్కు తీసుకున్న తర్వాత పసిడి ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి.

Gold: ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు, ఐటీ  రూల్స్ లో ఏముంది?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారతీయులకు బంగారం అంటే మహా మక్కువ. గోల్డ్( GOLD) ఇండియన్స్( INDIANS) కి ఎప్పుడు ఓ ఇన్వెస్ట్ మెంట్..2000 రూపాయల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) చెలామణి నుంచి వెనక్కు తీసుకున్న తర్వాత పసిడి ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. పింక్‌ నోట్లను వెనక్కు ఇచ్చేసిన ప్రజలు, ఎల్లో మెటల్‌లో పెట్టుబడులు పెంచారు. అయితే దీని వల్ల ఐటీ రూల్స్ కూడా స్ట్రిక్ట్ చేసింది. మీ ఇంట్లో గోల్డ్ ఎంత మొత్తంలో ఉండొచ్చనేది తెలుసుకోవల్సిందే. ఆదాయ పన్ను చట్టంలోని (Income Tax Act) నిబంధనల గురించి తెలుసుకోవాలి.

ఇన్‌కమ్ ట్యాక్స్( INCOME TAX) ఆఫీసర్లకు రుజువులు చూపగలిగితే, మీ ఇంట్లో ఎంత బంగారమైనా నిల్వ చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి పరిమితి లేదు. ఒకవేళ, మీ దగ్గర ఉన్న బంగారానికి ఎలాంటి రుజువులు లేకపోతే, ఇంట్లో నిల్వ చేయడంపై కొన్ని పరిమితులు ఉన్నాయి.

*వివాహిత ( MARRIED) మహిళ: పెళ్లైన మహిళ, తన ఇంట్లో అర కేజీ లేదా 500 గ్రాముల వరకు బంగారం/ బంగారు ఆభరణాలను దాచుకోవచ్చు. ఇంత వరకు బంగారం లీగల్..ఇంతకంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ లెక్కలు చూపించాల్సిందే.

* పెళ్లి కాని వారికి ( UN MARRIED) : వివాహం కాని మహిళ తన ఇంట్లో పావు కేజీ లేదా 250 గ్రాముల వరకు గోల్డ్‌ దాచుకోవచ్చు. ఇది కూడా ఆమెకు వారసత్వంగా వచ్చినట్లు లేదా కొనుక్కున్నట్లు లేదా బహుమతుల రూపంలో వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం పరిగణిస్తుంది.

* పురుషులు( GENTS) : వివాహం అయినా, కాకపోయినా పురుషులు కేవలం 100 గ్రాముల బంగారం మాత్రమే తన వద్ద ఉంచుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ఆదాయ పన్ను అధికార్లకు లెక్క చెప్పాలి.

ఇకపై మా అమ్మాయికి వంద తులాల బంగారం ఇచ్చాం అని ఎవరైనా చెబితే ...లెక్కలు చూపించాల్సిందే.

Tags:
Next Story
Share it