భార్య భర్తల మధ్య ఇంతకంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే ప్రమాదమే.!

ఈ సమాజంలో పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ క్యాప్ తప్పకుండా ఉంటుంది. సాధారణంగా ఏ జాబ్ ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఉంటే ఆ భార్యాభర్తలకు మంచి బాండింగ్

భార్య భర్తల మధ్య ఇంతకంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే ప్రమాదమే.!
X

న్యూస్ లైన్ డెస్క్: ఈ సమాజంలో పెళ్లి (Marraige) చేసుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ క్యాప్ తప్పకుండా ఉంటుంది. సాధారణంగా ఏ జాబ్ ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఉంటే ఆ భార్యాభర్తలకు మంచి బాండింగ్ ఉంటుందట. అంతకంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ వస్తే మాత్రం భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు వచ్చి ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారు. మరి ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి, ఎంత ఉండకూడదు అనే వివరాలు చూద్దాం. ముఖ్యంగా పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు దాటి ఏజ్ గ్యాప్ ఉండకూడదట. దీనివల్ల ఇద్దరి మధ్య అనేక భేదాభిప్రాయాలు ఏర్పడి విడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

ప్రాముఖ్యత:

ఏజ్ గ్యాప్(Age gap) ఎక్కువగా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ప్రాముఖ్యతలు మారుతాయి. ముఖ్యంగా 25 సంవత్సరాల లో మనం ఏ విధమైన పక్వతతో ఆలోచిస్తాము అందరికీ. 17 నుంచి 20 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఆలోచిస్తామో తెలుసు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఏజ్ క్యాప్ అనేది పెరిగితే ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి దీని వల్ల వారికి సమస్య ఏర్పడతాయి.

మెచ్యూరిటీ:

ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆలోచన విధానాల్లో మార్పు అనేక విధాలుగా వస్తుంది. ఇందులో భర్త ఏజ్ ఎక్కువగా ఉండి భార్య ఏజ్ చాలా తక్కువగా ఉంటే మెచ్యూరిటీ ఆలోచనలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా భర్త ఓటి అనుకుంటే భార్య మరోటి అంటుంది. దీనివల్ల ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయా అవకాశం ఉంటుంది.

అభిరుచులు :

ముఖ్యంగా ఏజ్ క్యాప్ అనేది పెరగడం వల్ల వారి వారి అభిరుచుల్లో మార్పులు వస్తాయి. అమ్మాయి వయసు అబ్బాయి కంటే ఎనిమిది నుంచి పది సంవత్సరాలు తక్కువగా ఉంటే మాత్రం వారి సంస్కృతి ఆలోచనల్లో మార్పులు కనిపిస్తాయి.

ఆరోగ్య సమస్యలు:

ముఖ్యంగా జీవిత భాగస్వామి(Life patner) మనకంటే పది నుంచి పదిహేను సంవత్సరాల పెద్దగా ఉంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా లైంగికంగా అంతగా యాక్టివ్ గా ఉండలేకపోవచ్చు. 30 సంవత్సరాల వయసు దాటినప్పుడు కొలెస్ట్రాల్ డయాబెటిస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎక్కువగా ఏజ్ గ్యాప్ లేకపోవడమే మంచిదని అంటున్నారు నిపుణులు.

Tags:
Next Story
Share it