Iidiot syndrome: ఇడియట్ సిండ్రోమ్ ..మార్కెట్లో మరో కొత్త రోగం

గూగుల్ చెప్పిందే నిజం..మనిషి తెలివి తెల్లారినట్టయింది ఈ గూగుల్ వచ్చాక..గూగుల్ మీద...గుడ్డి నమ్మకం వచ్చేసింది. ఈ మాయదారి రోగం పేరే ఇడియట్ సిండ్రోమ్

Iidiot syndrome: ఇడియట్ సిండ్రోమ్ ..మార్కెట్లో మరో కొత్త రోగం
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు జనాలందరికి ఈ రోగం ( SICK) ...ముసలి ముతక ఎవ్వరిని చూసినా ఇదే పరిస్థితి. ఎంత దారుణం అంటే యూట్యూబ్ ( YOUTUBE) రోగం కాదు పోయే కాలం. అసలు గూగుల్ తల్లి ఏ తలతిరిగో రెస్ట్ తీసుకుంటే మన జనాలంతా సచ్చిపోతారు. గూగుల్ చెప్పిందే నిజం..మనిషి తెలివి తెల్లారినట్టయింది ఈ గూగుల్ వచ్చాక..గూగుల్ మీద...గుడ్డి నమ్మకం వచ్చేసింది. ఈ మాయదారి రోగం పేరే ఇడియట్ సిండ్రోమ్( IDIOT SYNDROME )

అతిగా ఇంటర్నెట్ ( INTERNET) ‘ఇడియట్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు. అంటే ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ర్టక్షన్ ట్రీట్ మెంట్ ( TREATMENT) క్రోండియా అని కూడా పిలుస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీకున్న అనారోగ్య లక్షణాలను ఇంటర్నెట్ లో లభించే వైద్య సమాచారంతో పోల్చుకొని తప్పుగా అన్వయించుకోవడం అన్నమాట.

వైద్యం కోసం గూగుల్ ( GOOGLE) తమకు తాము మేలుకన్నా కీడే ఎక్కువగా చేసుకుంటున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది. అసలు ఫస్ట్ ఏదైనా ఇబ్బంది వస్తే చాలు గూగుల్ చేస్తున్నారు...ఆ తర్వాత డాక్టర్ ..అంతేనా వైద్యం గూగుల్ చేసేదే వైద్యం.. పొరపాటున డాక్టర్ ..ఈ కేసును మరోలా ట్రీట్ చేద్దామనుకుంటే నీ సంగతి ఇక అంతే గూగుల్ లో ఈ వైద్యం లేదు ..చంపేస్తాడా..సచ్చిపోతాడా వంద వెధవ ఆలోచనలు.

నమ్మదగ్గ వైద్య వెబ్ సైట్ల ( WEBSITE) మైన సమాచారం పొందడం వరకు మంచిదేనని.. కానీ అర్హతగల వైద్య నిపుణుడి వ్యాధి నిర్ధారణ సామర్థ్యానికి అది ఏమాత్రం సమానం కాదని స్పష్టం చేసింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు చెందిన ‘క్యూరియస్’(CURIOUS) వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ మాయదారి ఇడియట్ సిండ్రోమ్ ప్రస్తుతం వందలో 90 మందికి ఉందని తెలిపాయి సర్వేలు. ఎలా బయటపడతారో ఏమో...దేవుడికే తెలియాలి మరి..

Tags:
Next Story
Share it