yawning: వామ్మో ఇదేం ఆవిలింత రా నాయనా .. నోరు మూయడమే కుదరడం లేదట!

నిద్రకు ముందు ఆవలింతలు ( yawing) చాలా కామన్ . అయితే చాలా మందికి ఆవలింతలు వచ్చినపుడు మాత్రం దవడలు ఫట్ ఫట్ సౌండ్ వస్తుంటాయి.

yawning: వామ్మో ఇదేం ఆవిలింత రా నాయనా .. నోరు మూయడమే కుదరడం లేదట!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నిద్రకు ముందు ఆవలింతలు ( yawing) చాలా కామన్ . అయితే చాలా మందికి ఆవలింతలు వచ్చినపుడు మాత్రం దవడలు ఫట్ ఫట్ సౌండ్ వస్తుంటాయి. ఇంత వరకు అందరికి తెలిసిందే. కాని దవడ ఫట్ మని పట్టేస్తుంటాయి. సేమ్ ఇదే జరిగింది ఈ పిల్లకి ..పాపం నిద్రొస్తుంది ఆవలిస్తే ఫట్టున పట్టేసింది.

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన జెన్నా సినాట్రా( jenna sinatra) అనే 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు వెరైటీ కష్టం వచ్చిపడింది. ఆవలింత రావడంతో ఆమె పెద్దగా నోరు తెరవడంతో దవడ ఒక్కసారిగా లాక్ అయిపోయింది. నోరు ( mouth) మూయమడం సాధ్యం కాలేదు. దీంతో ఆమె బాధ ( pain) వర్ణనాతీతం..నోరు మూసుకోదు..దోమలు..ఈగలు తన చుట్టు తిరుగుతున్న ఫీలింగ్ .డాక్టర్ ( docter)దగ్గరకు వెళితే అసలు విషయం చెప్పారు. ఆమె బలంగా ఆవలించడం వల్ల దవడ ఎముక పక్కకు జరిగిందని గుర్తించారు. కొన్ని గంటలపాటు మరికొన్ని పరీక్షల తర్వాత చికిత్స ప్రారంభించారు. ఆమెకు నొప్పి తగ్గడానికి ముందుగా నోటికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చివరకు తల నుంచి దవడ దాకా పెద్ద కట్టు కట్టారు.

రెండు రోజుల ట్రీట్మెంట్( treatment) తర్వాత దవడ( jaw line) మళ్లీ నార్మల్ అయ్యింది. ఈ చికిత్సకు సంబంధించిన వీడియో ఆమె ఇన్ స్టాగ్రామ్( instagram) పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యి చచ్చింది. ఏకంగా 24 లక్షల వ్యూస్ లభించాయి. ఆమె పరిస్థితిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు. వామ్మో నోరు అంతగా తెరుచుకుంటారా ఎవరైనా అంటు కామెంట్లు చేస్తున్నారు.


Tags:
Next Story
Share it