పిల్లలకు తోబుట్టువు లేకపోవడం కూడా ప్రమాదమేనా..?

తొడబుట్టిన తోడు ఎన్ని పైసలు ఇచ్చినా దొరకదు అంటారు పెద్దలు. పూర్వకాలంలో ఒక్కో ఇంట్లో కనీసం ఐదుగురు కంటే ఎక్కువ సంతానాన్ని కనేవారు. అది కాస్త తగ్గుతూ తగ్గుతూ ఇద్దరు వద్దు,

పిల్లలకు తోబుట్టువు లేకపోవడం కూడా ప్రమాదమేనా..?
X

న్యూస్ లైన్ డెస్క్: తొడబుట్టిన తోడు ఎన్ని పైసలు ఇచ్చినా దొరకదు అంటారు పెద్దలు. పూర్వకాలంలో ఒక్కో ఇంట్లో కనీసం ఐదుగురు కంటే ఎక్కువ సంతానాన్ని కనేవారు. అది కాస్త తగ్గుతూ తగ్గుతూ ఇద్దరు వద్దు, ఒక్కరు ముద్దు అనే స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో బంధాలు బంధుత్వాలు అనే తేడా లేకుండా పోతుంది. అంతేకాకుండా తోడబుట్టిన అన్నా చెల్లెల్లా మధ్య రకరకాల సంబంధాలు ఏర్పడుతున్నాయి. అలాంటి ఈ క్రమంలో తోడబుట్టిన తోడు అనేది ఎంతో గొప్పదంటారు పెద్దలు. మరి తోడబుట్టిన తోడు లేకుంటే కలిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు ఒకరిని మాత్రమే కని చాలు అనుకుంటున్నారు. దీనివల్ల ఆ పుట్టిన పిల్లలకు అనేక సమస్యలు వస్తున్నాయట. ప్రేమానురాగాలంటే ఏంటో ఆ పిల్లలకు తెలియడం లేదట. అది ఎలాగే ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఇంట్లో అబ్బాయి లేదా అమ్మాయి ఒక్కరే ఉంటే వారు పెరిగే కొద్దీ వారిలో మానసిక రుగ్మతలు ఎక్కువగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలా ఒక్కరు ఉన్న వ్యక్తులు పదిమందిలో కలవాలంటే జంకుతారట. వారి అభిప్రాయాలను ఎవరితో కూడా పంచుకోలేరు.

ఇలా తోడు లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు ఆత్మ న్యూనతా భావంతో ఉంటారట. దీనివల్ల వారిలో అనారోగ్య సమస్యలు రావచ్చని, వ్యక్తిత్వ వికాసానికి భంగం కలగవచ్చని అంటున్నారు నిపుణులు. అయితే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరితో ఒకరు ఎలాంటి సమస్య వచ్చినా చెప్పుకుంటారట. ఇద్దరు కలిసి చాలా ఆనందంగా జీవిస్తారట. నవ్వులు, ఆటలు, చిలిపి పనులు ఇలా ఎన్నో వారి మధ్య ఉంటాయట. ఇద్దరు ఉండడం వల్ల పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెరిగి ప్రేమానురాగాలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఒక్కరు వద్దు, ఇద్దరు ముద్దు అని వారు చెబుతూ వస్తున్నారు.

Tags:
Next Story
Share it