Marriage:20-28 ఏజ్ అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిల్ని పెళ్ళికి రిజెక్ట్ చేస్తారట..!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం. అలాంటి ఈ మ్యారేజ్ లు ప్రస్తుత కాలంలో చాలా ఇబ్బందికరంగా మారాయి. చాలా ఏజ్ వచ్చేవరకు అబ్బాయిలు

Marriage:20-28 ఏజ్ అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిల్ని పెళ్ళికి రిజెక్ట్ చేస్తారట..!
X

న్యూస్ లైన్ డెస్క్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం. అలాంటి ఈ మ్యారేజ్ లు ప్రస్తుత కాలంలో చాలా ఇబ్బందికరంగా మారాయి. చాలా ఏజ్ వచ్చేవరకు అబ్బాయిలు, అమ్మాయిలు వివాహాలు చేసుకోవడం లేదు. లైఫ్ లో సెట్ అవ్వాలనే ఆలోచన ధోరణితో పెళ్లిళ్లు లేట్ చేస్తున్నారు. అంతేకాకుండా మరికొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు దొరక్క పెళ్లి చేసుకోవడానికి లేట్ అవుతుంది. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే ఇంట్లో పెద్దలు ఏ అబ్బాయిని చేసుకోమంటే ఆ అబ్బాయిని అమ్మాయిలు చేసుకునేవారు.

ప్రస్తుతం కాలం మారడంతో అమ్మాయిలే అబ్బాయిని సెలెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా అబ్బాయి సంపాదన నుంచి మొదలు హైట్, అందం అన్ని చూస్తున్నారు. అబ్బాయి నచ్చితేనే అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తోంది. అలాంటి ఈ మోడ్రన్ సమాజంలో చాలామంది 20 నుంచి 28 ఏళ్ల వయసు అమ్మాయిలు అబ్బాయిలను ఈ చిన్న కారణాలవల్లే రిజెక్ట్ చేస్తున్నారట.మరి ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

20-24 ఏజ్ అమ్మాయిలు :

ఈ వయసులో ఉన్నటువంటి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను ఈ విధమైనటువంటి కారణాలవల్లే రిజెక్ట్ చేస్తున్నారట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అబ్బాయికి గడ్డం బాగా ఉండాలట. అది లేకుంటే కూడా రిజెక్ట్ చేస్తున్నారట. అంతేకాకుండా అబ్బాయికి మంచి జిమ్ బాడీ ఉండాలట ఏమాత్రం పొట్ట ఉన్నా కానీ రిజెక్ట్ చేస్తున్నారట. ఫోర్ హెడ్ ఎప్పుడైనా సరే మూడు నామాలు పట్టే అంత ఉంటే సరే, అంతకంటే ఎక్కువ స్పేస్ ఉందంటే రిజెక్ట్.

25-28 ఏజ్ అమ్మాయిలు:

ఈ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు కనీసం 50-70వేల పైన సంపాదించాలి. తప్పనిసరిగా ఒక కారు మైంటైన్ చేయాలి. అంతేకాకుండా అబ్బాయికి అన్ని అలవాట్లు కొద్దికొద్దిగా ఉండాలి. అంతేకాకుండా అబ్బాయిలకు అక్క ఉన్నా కానీ రిజెక్ట్ చేస్తున్నారట.

28 ఆపై వయసు అమ్మాయిలు :

ఇక ఈ వయసులో ఉన్నటువంటి ఈ అమ్మాయిలు చాలామంది అబ్బాయిలను ఎక్కువ శాతం రిజక్ట్ చేయరు కానీ వారి అహం వల్ల కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారట. అంటే అబ్బాయిల ముందు మనం తగ్గి ఉండకూడదు అని ఆలోచనతోనే ఇలా జరుగుతుందట. ముఖ్యంగా ఈ ఏజ్ అమ్మాయిలు, అబ్బాయిని చూడగానే ఓకే అనుకుంటరు కానీ, అబ్బాయి నన్ను ఒకే చెబుతాడో లేడో అనే ఆలోచనతోనే ముందుగానే అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారట.

Tags:
Next Story
Share it