FERTILITY: అసలు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ పాత్రల వల్లే !

నాన్​స్టిక్ పాత్రల్లో వండుకుని తినడం వల్ల హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్ , సంతానోత్పత్తి , పీసీఓడీ , థైరాయిడ్ సమస్యలు తలెత్తవచ్చని ICMR తెలిపింది.

FERTILITY: అసలు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ పాత్రల వల్లే !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాన్ స్టిక్( NON STICK) ..ఇప్పుడు ప్రతి ఇంట్లోను ఇవే వంటపాత్రలు..నూనె( OIL) జిడ్డు లేకుండా...పాత్రలు నీట్ గా ఉంటున్నవే చూస్తున్నారు కాని..కెమికల్ కోటింగ్( CHEMICAL COATING) ఉన్న పాత్రల్లో తింటే వచ్చే నష్టాలను అస్సలు పట్టించుకోవడం లేదు.

నాన్​స్టిక్​ ( NONSTICK) పాత్రల్లో వండుకుంటే తీవ్రమైన ఆరోగ్యసమస్యలు వచ్చే ప్రమాదముందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. నాన్​స్టిక్ పాత్రల్లో వండుకుని తినడం వల్ల హార్మోన్లలో అసమతుల్యత( HORMONAL IMBALANCE), క్యాన్సర్( CANCER), సంతానోత్పత్తి( FERTILITY) , పీసీఓడీ( PCOD) , థైరాయిడ్ సమస్యలు తలెత్తవచ్చని ICMR తెలిపింది. అందుకే నాన్​స్టిక్ పాత్రలకు బదులుగా మట్టిపాత్రల్లో వండుకోవడం అత్యంత సురక్షితమని తెలిపింది.

నాన్​స్టిక్ కుక్​వేర్​లలో టెఫ్లాన్​ ( TEFLON COATING) కోటింగ్ అధిక ఉష్ణోగ్రతల్లో వేడి చేసినప్పుడు పెర్​ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్, పెర్​ఫ్లోరోక్టానెసల్ఫోనిక్ యాసిడ్​లను విడుదల చేస్తుంది. ఈ రసాయానాలు వంటలోనే కాకుండా.. గాలిలోకి విడుదలై ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. నిజానికి నాన్ స్టిక్ ఇండియన్ వంటకు పనికి రాదు. పైగా టెఫ్లాన్ కోటింగ్..కరిగి పొగలా మారి...లంగ్స్ ( LUNGS) పోతాయి. అంతేకాదు...పెరుగుతున్న ఫెర్టిలిటీ సమస్యలకు కూడా ఇదే కారణమని సర్వేలు చెబుతున్నాయి.

నాన్​స్టిక్ వంట పాత్రలపై చిన్న గీత పడినా.. దాని మీద ఉన్న టెఫ్లాన్ వల్ల వాయువులో, వంటలో కొన్ని కెమికల్స్ కలుస్తాయి. అందులోను మనం స్టీల్ గరెటెలతో గీస్తూ ఉంటాం. ఒక్క గీత నుంచి సుమారు 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతున్నాయని ICMR పేర్కొంది. ఐరన్ కు మారితే ఈ ప్రమాదం నుంచి చాలా వరకు బయపడవచ్చు.నాన్​స్టిక్​కు ప్రత్యామ్నాయంగా మట్టి, గ్రానైట్ వంటి పాత్రల్లో వండుకుంటే మంచిదని సూచించింది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

Tags:
Next Story
Share it