Malaria : మలేరియా వ్యాపిస్తుంది..పిల్లలు జాగ్రత్త.

మలేరియా( MALARIA).. దీని వల్ల వ్యాప్తి చేసే దోమలు పెరుగుతాయి. తేమ, వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి.

Malaria : మలేరియా వ్యాపిస్తుంది..పిల్లలు జాగ్రత్త.
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వాతావరణంలో మార్పులు జరిగే సమయంలో ఎన్నో వందల కొత్త బాక్టీరియాలు...పాత రోగాలు వెంటపడుతుంటాయి. అందులో ఫస్ట్ ఉండేది మలేరియా( MALARIA).. దీని వల్ల వ్యాప్తి చేసే దోమలు పెరుగుతాయి. తేమ, వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో దోమలు పెరగకుండా, మలేరియా రాకుండా తగిన జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి.

మలేరియా అనేది దోమల ద్వారా సంక్రమించే అంటువ్యాధి. కొన్ని ప్రాంతాల్లో ఇది ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. దానికి వాతావరణంలోని మార్పులే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. వెట్​గా ఉండే ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అందుకే ఇప్పుడు దోమల సంతానోత్పత్తికి అనుకూలమైన కాలం. కాబట్టి నీటిని నిల్వ ఉంచే ప్లేసులు ఉండకూడదు.

దోమలు కుట్టకపోతే మలేరియా( MALARIA) రాదు. కాబట్టి దోమలు కుట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రూమ్​లో దోమలు లేకుండా.. బెడ్ చుట్టూ దోమల తెరలు కట్టుకోవాలి. దోమలు కుట్టకుండా క్రీమ్స్, రోల్స్, కాయిల్స్ వాడొచ్చు. పిల్లలకు ఫుల్ గా ఉండే బట్టలు వెయ్యండి.

* గది, కిటికీలకు మీరు మెష్ ( MESS) పెట్టుకోవచ్చు. దోమలు లోపలికి రాకుండా హెల్ప్ చేస్తాయి. ఫుల్ ప్యాంట్స్, పొడవాటి స్లీవ్స్​, సాక్స్​లు వేసుకోవాలి.

* లేత రంగు దుస్తులు ( LIGHT COLOUR DRESS) దోమలను తక్కువగా ఆకర్షిస్తాయి కాబట్టి అలాంటి లైట్ కలర్స్ వేసుకుంటే మంచిది.

*మలేరియా వ్యాప్తి ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ మలేరియా వస్తే వెంటనే వైద్యుడి సలహాలు తీసుకుంటే మంచిది.

*తలనొప్పి( HEAD ACHE) , శరీరంలో నొప్పులు( BODY PAINS) , చలి ( COLD) ఎక్కువ అవ్వడం, అలసట, జ్వరం, చెమట, రక్తహీనత, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి మలేరియా లక్షణాలు. ఈ లక్షణాలు ఉంటే ..వెంటనే డాక్టర్ కలవండి.

Tags:
Next Story
Share it