SONGS: బ్రేకప్ సాంగ్స్ వింటున్నారా...మీరు హ్యాపీ గా ఉన్నట్టే

మరికొంతమందికి..సూపర్ కూల్...సాడ్ సాంగ్స్ ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ కాని సాడ్ సాంగ్స్ వినే వాళ్లందరు మానసికంగా చాలా హ్యాపీ గా ఉంటారట

SONGS: బ్రేకప్ సాంగ్స్ వింటున్నారా...మీరు హ్యాపీ గా ఉన్నట్టే
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది మాంచి జోష్ కావాలి..మరి కొంతమందికి మాస్ మసాలా సాంగ్ కావాలి. మరికొంతమందికి..సూపర్ కూల్...సాడ్ సాంగ్స్ ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ కాని సాడ్ సాంగ్స్ వినే వాళ్లందరు మానసికంగా చాలా హ్యాపీ గా ఉంటారట. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్స్ వినేవాళ్లు మాత్రం అనుకున్నంత హ్యాపీగా ఉంటారట. కాని వాళ్లు ఈ పాటలు విన్నంత సేపు మాత్రమే హ్యాపీ గా ఉంటారని ఓ చిన్న పరిశోధన లో తేలింది.

మెంటల్ హెల్త్‌ని మెరుగు పరిచే చాలా రకాల ట్రీట్‌మెంట్‌లలో Music Therapy కూడా ఒకటి. ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యానికి ఇంత కన్నా మంచి మందు ఇంకోటి ఉండదు. ఓ పనిపై ఫోకస్ పెరగాలన్నా, ఆనందంగా ఉండాలన్న సంగీతం నేర్చుకోవడమో, వినమో చేయాల్సిందే. ఎన్నో సైంటిఫిక్ స్టడీస్‌ (How Sad Songs Help Mental Health) కూడా ఇదే విషయం చెప్పాయి. స్లో సాంగ్స్ వింటే మీ మెదడు రిలాక్సేషన్ హార్మోన్స్ ను రిలీజ్ చేస్తుంది దీనివల్ల హ్యాపీగా ఉంటారు. చాలా సేపు వరకు మీకు ప్రశాంతంగా ఉంటుంది.

ఇక బయాలజికల్‌గా చెప్పాలంటే...మనం ఏదైనా ఓ బాధలో ఉన్నప్పుడో..లేదంటే మనకు బాగా కావాల్సిన వాళ్లు బాధలో ఉన్నప్పుడు మనలో తెలియకుండానే Prolactin,Oxytocin హార్మోన్‌లు విడుదలవుతాయి. మనం పూర్తిగా బాధలో కూరుకుపోకుండా ఈ హార్మోన్‌లు డిఫెండ్ చేస్తూ ఉంటాయి.

ఆ మధ్య Youth Music అనే ఓ రీసెర్చ్ స్టడీ చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 16-24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వాళ్లలో 93% మంది Music,Lyrics ని ఓ థెరపీగా ఫీల్ అవుతున్నారట. కొవిడ్ తరవాత అన్ని దేశాల్లోనూ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడింది. ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక్కొక్కరూ ఒక్కో దారి వెతుక్కుంటున్నారు.. సో ఫాస్ట్ బీట్ కాస్త తగ్గించి స్లో మ్యూజిక్ ను ఎంజాయ్ చెయ్యండి.

Tags:
Next Story
Share it