TRADITIONAL WEAR: ట్రెడిషినల్ బట్టలే ఆ క్యాన్సర్ కు కారకాలా?

చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్ ఇది చీర ధరించే స్త్రీలలో నడుము పొడవునా వస్తుంది. నడుము చుట్టు చాలా వరకు కొవ్వు పేరుకుపోయి ఉంటుంది.

TRADITIONAL WEAR: ట్రెడిషినల్ బట్టలే  ఆ క్యాన్సర్ కు కారకాలా?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మన భారత్ వస్త్రధారణ ఆరోగ్యమైనదని మనం ఇప్పటి వరకు నమ్మాం. అయితే మన సాంప్రదాయ వస్త్రధారణ వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. చీరలు కట్టుకున్న వారిలో 68 శాతం మందికి ఈ క్యాన్సర్లు వస్తున్నట్లు తెలిపారు. చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్. చీర కట్టుకోవడానికి ఆడవారు లంగా లాంటి ఇన్నర్స్ ను టైట్ గా వేసుకుంటారు. దీని వల్ల ఆ లంగా , ఇన్నర్ వేసుకునే ప్లేస్ అంటే నడుము చుట్టు నల్లగా , మచ్చలు అయిపోయి ..చాలామంది లో ఇలాంటి ప్లేసుల్లో తామర వచ్చి ఉంటుంది. దీని వల్ల ఆ ప్లేస్ లో ఎక్కువగా ఎండ తగలడం కష్టం కాబట్టే ఈ నడుము భాగంలో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్( SKIN CANCER). ఇది చీర ధరించే స్త్రీలలో నడుము పొడవునా వస్తుంది. నడుము చుట్టు చాలా వరకు కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అంతేకాదు ఆ ప్లేస్ లో టైట్ గా కట్టడం వల్ల రక్తప్రసరణ కాస్త తగ్గి ఉంటుంది. దీని వల్ల ఆ ప్లేస్ లో స్కిన్ త్వరగా పాడయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో క్యాన్సర్ వచ్చిందని తెలిసే లోపు స్కిన్ పాడయిపోతుంది. కొంతమందిలో ఊడిపోతుంది కూడా .

“భారతదేశంలో, సంవత్సరాలుగా చీరలు ధరించే మహిళలకు క్యాన్సర్ ( CANCER) వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టైట్ గా లంగా వేసుకోవడం వలన నడుము భాగంలో దురద మొదలై.. రోజు గడుస్తున్న కొద్దీ నడుము చుట్టూ ఉన్న చర్మం ఊడిపోవడం మొదలవుతుంది. ఈ లక్షణాలను నార్మల్ గా పట్టించుకోకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు.




చీర అనే కాదు ..మీరు ధరించే జీన్స్ ( JEANS) , స్కట్స్ , ఏదైనా టైట్ బట్టలు( TIGHT DRESS) వేసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. పరిశోధన ప్రకారం జీన్స్ పురుషులలో పొత్తికడుపు కింది భాగంలో ఉష్ణోగ్రతను పెంచుతుందని.. ఇది స్పెర్మ్ కౌంట్( SPREAM COUNT) ను తగ్గించి వృషణాల క్యాన్సర్ (టెస్టిక్యూలర్ క్యాన్సర్)కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి బట్టలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.

Tags:
Next Story
Share it