UBER : ఉబర్ డ్రైవర్ జీతం నెలకు 12 లక్షలు..అంత జీతం ఎలా ?

గొప్ప గొప్ప ఆశయాలతో ఉద్యోగాలు వెతుక్కున్నాడు. మంచి ఉద్యోగం లేదు. వ్యాపారం చేసేంత డబ్బులు లేవు.

UBER : ఉబర్ డ్రైవర్ జీతం నెలకు 12 లక్షలు..అంత జీతం ఎలా ?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు ఉపాయం ఉండాలి కాని దారి దొరకదా...అదృష్టవంతుడు ...బూడిదతో కూడా బొమ్మలు చేసి అమ్మగలడు..అదే దురదృష్టవంతుడు కోట్ల డబ్బులో కూడా లాభాలు రాలేదని ఆగిపోతాడు. అంతే దేనికైనా టైం కలిసిరావాలి కదా...ఈ ఉబర్ డ్రైవర్ ( UBER DRIVER) అదృష్టవంతుల లిస్ట్ లో వెయ్యాలి. పాపం లైఫ్ లో మంచి జ్యూయలరీ డిజైనర్ కావాలని కలలు కన్నాడు. గొప్ప గొప్ప ఆశయాలతో ఉద్యోగాలు వెతుక్కున్నాడు. మంచి ఉద్యోగం లేదు. వ్యాపారం చేసేంత డబ్బులు లేవు. దీంతో ఇంట్లో ఉన్న నగ నట్రా అమ్మేసి ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని ఉబర్ డ్రైవర్ గా చేరారు.



దాదాపు రెండేళ్లు డ్రైవర్ గా చేశాక...తను డిజైన్ చేసిన జ్యూయలరీ ( JEWLLERY) మొత్తాన్ని కారులోనే ఎగ్జిబిషన్ పెట్టాడు. జనాలు చూసి నచ్చి కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఇతనే చైనాకు చెందిన గావిన్ ఎస్కేలర్..ఇఫ్పుడు నాలుగు సొంత కార్లు, ఏడాదికి 12 లక్షల సంపాదన,..ఓన్ జ్యూయలరీ డిజైన్ షాపు తో మంచి ఫామ్ లో ఉన్నాడు.

నిజానికి ఉన్న అవకాశాన్ని వాడుకొని పైకి ఎదగడం అంటే ఇదే. ఉబర్ క్యాబ్ డ్రైవింగ్ అనే చిన్న అవకాశాన్ని తను కలలు కన్న జ్యూయలరీ డిజైన్స్ ను అమ్మే ప్లేస్ లా మార్చుకున్నాడు అటు తన కల నిజం చేసుకుంటూనే హ్యాపీగా ...లైఫ్ లో సక్సస్ ను మీట్ అయ్యాడు..చైనాలో ఇప్పుడు ఫేమస్ ఉబర్ డ్రైవర్ ఈ గావిన్ ఎస్కేలర్ .

Tags:
Next Story
Share it