Govt Apps: ఫోన్లో కచ్చితంగా ఉండాల్సిన ప్రభుత్వ యాప్ లు! వాటి వల్ల కలిగే ఉపయోగాలు!

ఆఫీసులకి డిపార్ట్ మెంట్స్ కి అఫిషియల్ వెబ్ సైట్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండాల్సిన కొన్ని గవర్నమెంట్ యాప్స్ ఉన్నాయి అవేంటో చూసేద్దాం.


Published Sep 29, 2024 01:41:00 PM
postImages/2024-09-29/1727597545_theceoimport202006govtapps.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఒకప్పుడు ఒక పని అవ్వాలంటే ఆఫీసుల చుట్టు తిరగలేక చచ్చేవాళ్లం. కాని ఇప్పుడు అలా కాదు..జస్ట్ ఫోన్ ఒక్కటుంటే చాలు ..అన్ని ఆఫీసులకి డిపార్ట్ మెంట్స్ కి అఫిషియల్ వెబ్ సైట్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండాల్సిన కొన్ని గవర్నమెంట్ యాప్స్ ఉన్నాయి అవేంటో చూసేద్దాం.


maadhaar: ఈ యాప్ సహాయంతో ఆధార్ కి సంబంధించిన పనులను సులభంగా చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో మీ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం, ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్, ఆధార్ వెరిఫై చేయడం ఇంకా ఇమెయిల్/మొబైల్ వెరిఫై చేయడం వంటి మీరు ఈ యాప్ లో మా ఆధార్ యాప్ లో చేసేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ కు తిరగాల్సిన అవసరం లేదు. 


mParivahan: మీరు కార్, బైక్ లేదా మరేదైన వాహనం వాడుతున్నట్లైతే ఈ యాప్ సహాయంతో మీ వాహనం గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వర్చువల్ ఆర్ సీ , వర్చువల్ డీఎల్ , ఆర్ సీ ఇలా చాలా విషయాలు ఎవరి సాయం లేకుండా మీరే చూసుకోవచ్చు.


mPassport: ఈ యాప్ ద్వారా పాస్‌పోర్ట్‌కు సంబంధించిన పనులు సులభం అవుతాయి. పాస్ పోర్ట్ పనులను ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు అపాయింట్ మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. పాస్ పోర్ట్ అప్లై చేసుకోవచ్చు. పాస్ పోర్ట్ స్టేటస్ చెక్ చేయడమే కాదు..ఈజీగా వెయిటింగ్ లేకుండా పని జరిగిపోతుంది.


Digilocker: ఈ యాప్ లో మీరు మీకు సంబంధించిన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ లను సేఫ్ గా ఉంచవచ్చు. ఈ యాప్‌లో మీరు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎడ్యుకేషన్ మార్క్‌షీట్‌ల వంటి డాక్యుమెంట్ లని డిజిటల్ రూపంలో సెక్యూర్ గా స్టోర్‌ చేసుకోవచ్చు.


Umang: ఈ యాప్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ సేవలను పొందవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, గ్యాస్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్, రైలు టిక్కెట్ బుకింగ్ వంటి చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు. ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే మీ పని ఈజీగా ఉంటుంది. సో చూసుకొండి ..ఈ యాప్స్ ఉన్నాయో లేదో.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles