రామోజీ అంత్యక్రియలకు బాలకృష్ణ వెళ్లలేదా.. కారణం.!

రామోజీరావు మీడియా మొగల్ గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఈయన చేయని బిజినెస్ లేదు. బిజినెస్ రంగంలో అద్భుతమైన ఎదుగుదల సాధించిన గొప్ప వ్యక్తి. అలాంటి రామోజీరావు

రామోజీ అంత్యక్రియలకు బాలకృష్ణ వెళ్లలేదా.. కారణం.!
X

న్యూస్ లైన్ డెస్క్: రామోజీరావు మీడియా మొగల్ గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఈయన చేయని బిజినెస్ లేదు. బిజినెస్ రంగంలో అద్భుతమైన ఎదుగుదల సాధించిన గొప్ప వ్యక్తి. అలాంటి రామోజీరావు మరణించడం చాలా బాధాకరం. ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, అన్ని మీడియా ప్రతినిధులు ఎంతో మంది ఆయనకు నివాళులర్పించారు. ఇలా ఎంతో మందితో బాండింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి రామోజీరావు బాలకృష్ణ దంపతులతో మరింత సత్సంబంధాలు ఉండేవట.

ఈ విధంగా ఎంతో దగ్గరైనటువంటి బాలకృష్ణ దంపతులు రామోజీని కడసారి నివాళులర్పించేందుకు రాలేదట. ప్రస్తుతం వీరి గురించే సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో దగ్గర అని చెప్పుకునే రామోజీ అంత్యక్రియలకు బాలకృష్ణ దంపతులు ఎందుకు రాలేదని ఒక్కొక్కరు ఒక్క విధంగా స్పందిస్తూ వార్తల్లో రాస్తున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ సతీమణి వసుంధర తండ్రి సూర్యారావు రామోజీరావు మంచి స్నేహితులు. రామోజీకి కూతురు లేకపోవడంతో వసుంధరాను చాలా ఆప్యాయంగా చూసుకునేవారట. అంతేకాదు రామోజీ ఇంట్లోనే వసుంధర ఎక్కువగా ఉండేదట.

అయితే సీనియర్ ఎన్టీఆర్ కూడా రామోజీ ఇంట్లోనే వసుంధరను చూసి బాలకృష్ణతో వివాహం చేశారట. ఈ విధంగా బాండింగ్ ఉన్నటువంటి బాలకృష్ణ దంపతులు రామోజీరావును కళాశాల చూసేందుకు రాకపోవడంతో ఆయన ఎందుకు రాలేదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే రామోజీరావు మరణంపై స్పందించినటువంటి బాలకృష్ణ మా నాన్న గారి నుంచి రామోజీరావుతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని, మీడియా రంగంలో ఎదిగిన గొప్ప ధీరుడు అని , తెలుగు నేలపై అతిపెద్ద స్టూడియోను స్థాపించిన దిశాలి అంటూ ఆయనతో బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Tags:
Next Story
Share it