Pallavi prashanth:పల్లవి ప్రశాంత్ కు పెళ్లయిందా..  అమ్మాయి ఈవిడే..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్  7కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి.

Pallavi prashanth:పల్లవి ప్రశాంత్ కు పెళ్లయిందా..  అమ్మాయి ఈవిడే..!
X

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ 7కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక కామన్ మ్యాన్ తరహాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా చాలా ఫేమస్ అయ్యారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో రతికతో ప్రేమయానం మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత భంగపడ్డారు. చివరికి హౌస్ లో ఉన్న వారంతా రైతు అనే సెంటిమెంట్ తో నువ్వు ఆడుతున్నావని ఆయనను చాలా అవమానించారు.

అయినా నేను రైతునే, రైతు బిడ్డని గౌరవంగా చెప్పుకుంటూ మాట్లాడారు. దీంతో పల్లవి ప్రశాంత్ మరికాస్త ఫేమస్ అయిపోయారని చెప్పవచ్చు. మొదట్లో కాస్త అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడని విమర్శలు ఎదుర్కొన్నా, కానీ ఆ తర్వాత నాగార్జున కౌంటర్స్ తో సెట్ అయిపోయాడు. అలా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ కు పెళ్లయిందని ఒక వార్త వైరల్ అవుతుంది. ఆయన పూర్తిగా పెళ్లి బట్టల్లో ఉన్నాడు. వధువు పక్కన నిలుచుని ఆమెను చూస్తున్నాడు. ఇది చూసిన నెటిజన్స్ అంతా పల్లవి ప్రశాంత్ కు పెళ్లి అయిపోయిందా.. అయినా ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టారు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు..

ఇదే క్రమంలో ప్రశాంత్ గురించి యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి తల్లిదండ్రులు ఒక విషయాన్ని చెప్పారు. మా కొడుకు బయటకు రాగానే వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ పెళ్లి ఫోటోలు బయటకు రావడం, వారు ఆ విధంగా మాట్లాడడం చూస్తుంటే అసలు ప్రశాంత్ కు పెళ్లి అయిందా లేదా అని గందరగోళం అవుతున్నారు.

Tags:
Next Story
Share it