Hero: స్టార్ హీరో కి షాక్.. ఇండస్ట్రీ నుండి బ్యాన్..?

సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో నిబంధలు,నియమాలు ఉంటాయి. అయితే ఆ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఇండస్ట్రీలో సాఫీగా వారి జీవితం కొనసాగుతుంది. ఒకవేళ ఆ నియమ నిబంధనలను

Hero: స్టార్ హీరో కి షాక్.. ఇండస్ట్రీ నుండి బ్యాన్..?
X

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో నిబంధలు,నియమాలు ఉంటాయి. అయితే ఆ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఇండస్ట్రీలో సాఫీగా వారి జీవితం కొనసాగుతుంది. ఒకవేళ ఆ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కచ్చితంగా వారిపై నిషేధం(Ban)) విధిస్తారు.

అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోని బ్యాన్ చేసే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో అని అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ నటుడు శింబు(Simbu) .ఇక విషయంలోకి వెళ్తే..హీరో శింబుపై నిర్మాత అయిన ఇషారి కే.గణేష్ (Isharri k ganesh) నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశారు. శింబు మా సినిమా ఆయన కరోణా కుమార్ మూవీ(Karona kumar movie) షూటింగ్లో పాల్గొనక ముందే అడ్వాన్స్ డబ్బులు తీసుకొని సినిమా నుండి తప్పుకున్నారు.వెంటనే శింబుపై చర్యలు తీసుకొని ఆయనను తమిళ ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి అంటూ నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశారు.


ఇక ఈయన ఫిర్యాదుతో ఇండస్ట్రీలో గందరగోళం ఏర్పడింది.నిజంగానే శింబు (Simbu) పై బహిష్కరణ వేటు పడుతుందా ఏంటి అని ఆయన అభిమానులు భయపడుతున్నారు. అంతేకాదు ఆయన కరోణా కుమార్ మూవీ నుండి తప్పుకోవడం వల్ల ఇప్పుడు చేస్తున్న సినిమా అలాగే చేయబోయే సినిమాలన్నింటి నుండి శింబు ని తీసివేయాలి అని కూడా నిర్మాత ఇషారి కే గణేష్ నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ విషయంపై కోలీవుడ్లో గందరగోళం నెలకొంది. ఇక ప్రస్తుతం శింబు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal haasan) హీరోగా చేస్తున్న థగ్ లైఫ్ మూవీ (Thug life movie) లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి చూడాలి శింబుని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తారా లేదా అనేది

Tags:
Next Story
Share it