Aishwarya Arjun Marriage : హనుమాన్ టెంపుల్ లో ఘనంగా అర్జున్ సర్జా కూతురి పెళ్లి

కోలీవుడ్ లెజెండరీ నటుడు.. డైరెక్టర్ కమెడియన్ తంబి ( TAMBI RAMAYYA)రామయ్య కొడుకు .. యంగ్ హీరో ఉమాపతితో వివాహ బంధంలో అడుగుపెట్టింది

Aishwarya Arjun Marriage : హనుమాన్ టెంపుల్ లో ఘనంగా అర్జున్ సర్జా కూతురి పెళ్లి
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కన్నడ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా( ARJUN SARJA) పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ లెజెండరీ నటుడు.. డైరెక్టర్ కమెడియన్ తంబి ( TAMBI RAMAYYA)రామయ్య కొడుకు .. యంగ్ హీరో ఉమాపతితో వివాహ బంధంలో అడుగుపెట్టింది. వీరిద్దరి వివాహం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో జరిగింది.

కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి రామయ్య( UMAPATHI RAMAYYA). తండ్రితో పాటు ఈయన కూడా చాలా సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా మానియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి చిత్రాల్లో కనిపించాడు. అలాగే ఐశ్వర్యా అర్జున్( AISHWARYA ARJUN) కూడా ఓ సినిమా చేసింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట ఇప్పుడు పెళ్లి తో ఒక్కటి అయ్యారు. సోషల్ మీడియాలో వీరి పెళ్లి పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.











Tags:
Next Story
Share it