Aishwarya: ధనుష్ తో విడిపోయాకే సేఫ్ గా ఉన్నా.. ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్..!!

రజినీకాంత్(rajinikanth) కూతురు ఐశ్వర్య ధనుష్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇరు కుటుంబాలు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడంతో

Aishwarya: ధనుష్ తో విడిపోయాకే సేఫ్ గా ఉన్నా.. ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్..!!
X

న్యూస్ లైన్ డెస్క్: రజినీకాంత్(rajinikanth) కూతురు ఐశ్వర్య ధనుష్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇరు కుటుంబాలు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడంతో పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా అంగరంగ వైభవంగా చేశారు. అయితే పెళ్ళై ఇద్దరు కొడుకులు పుట్టాక దాదాపు 18 సంవత్సరాల తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ కొడుకులు పుట్టి అంత పెద్ద వాళ్ళు అయినా సరే గొడవలు పడుతూ కలిసి ఉండలేక విడిపోయి ఇద్దరు హాయిగా ఉంటున్నారు.

అయితే వీరు విడాకులు తీసుకోవాలనుకున్న సమయంలో రజినీకాంత్ కుటుంబం అలాగే ధనుష్(dhanush) కుటుంబం ఇద్దరు వారికి సర్ది చెప్పాలని చూసినా కూడా ఒప్పుకోకపోయేసరికి ఇద్దరు విడిపోయారు.అయితే పిల్లలకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే పేరెంట్స్ లాగే వ్యవహరిస్తూ ఉంటారు. అయితే విడాకులు తీసుకొని ఇన్ని రోజులైనా కూడా ఇప్పటివరకు ఐశ్వర్య గానీ..ధనుష్ గానీ తమ విడాకుల గురించి నోరు విప్పలేదు. అయితే మొదటిసారి ఐశ్వర్య(ishwarya) లాల్ సలాం ఇంటర్వ్యూలో భాగంగా విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. విడాకుల తర్వాత మీ జీవితం ఎలా ఉంది అని యాంకర్ ఐశ్వర్యను అడగగా..

డివోర్స్(divorce) తీసుకున్నాక కూడా నేను నా లైఫ్ లో చాలా హ్యాపీగానే జీవిస్తున్నాను. అలాగే ఒంటరిగా ఉంటేనే చాలా సేఫ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది.ఎందుకంటే నేను ఈ విడాకులు తీసుకున్న రెండేళ్లలో ఇదే గమనించాను. ప్రస్తుతం అయితే హ్యాపీగా ఉన్నాను.పిల్లల కోసం నేను ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చాను.కానీ మళ్ళీ పిల్లలు పెద్దవ్వడంతో సినిమాల్లో కం బ్యాక్ అయ్యాను.. అంటూ విడాకుల తర్వాత ఎంతో హ్యాపీగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేసింది ఐశ్వర్య రజినీకాంత్.

Tags:
Next Story
Share it