Ajay Ghosh:అద్భుత కథతో మ్యూజిక్ షాప్ మూర్తి..త్వరలో రిలీజ్..!

చాలామంది తెలుగు వాళ్లకు తమిళ సినిమాలు చూడగానే మన జీవితంలో జరిగే కొన్ని సీన్స్ గుర్తుకు వస్తాయి. అవి ఎవరి జీవితానికి వారు ఆపాదించుకునేలా కథలు ఉంటాయి. అలాంటి

Ajay Ghosh:అద్భుత కథతో మ్యూజిక్ షాప్ మూర్తి..త్వరలో రిలీజ్..!
X

న్యూస్ లైన్ డెస్క్: చాలామంది తెలుగు వాళ్లకు తమిళ సినిమాలు చూడగానే మన జీవితంలో జరిగే కొన్ని సీన్స్ గుర్తుకు వస్తాయి. అవి ఎవరి జీవితానికి వారు ఆపాదించుకునేలా కథలు ఉంటాయి. అలాంటి సినిమాలు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే దర్శకులు మాత్రమే తీస్తుంటారు. ఇదే తరుణంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మధ్య తరగతి జీవితాల్లో పడే కష్టాలు, మధ్యతరగతి వారు కలలుకని వాటిని నెరవేర్చుకునే విధానంపై తెరకెక్కిన అద్భుతమైన మూవీ "మ్యూజిక్ షాప్ మూర్తి". ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై, హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మిస్తున్నారు. అంతేకాకుండా శివ పాలడుగు(Shiva paladugu)ఈ మూవీకి కథనాన్ని అందిస్తూ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు, పోస్టర్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి.

అలాంటి ఈ చిత్రం గురించి కొన్ని వివరాలు చూద్దాం. మ్యూజిక్ షాప్ మూర్తి జూన్ 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఇదే తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ సందర్భంలోనే అజయ్ ఘోష్(Ajay Ghosh)ఆధ్వర్యంలో మ్యూజిక్ షాప్ మూర్తి గురించి, అందులో నటించిన నటీనటులు టెక్నీషియన్స్ వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సినిమా మధ్యతరగతి ప్రజలకు ఎంతో కనెక్ట్ అవుతుందని, కలలు కనడమే కాకుండా, ఆ కలలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనేది ఈ చిత్రం ద్వారా చూపించారు. ఇక ఇందులో ప్రధాన పాత్రలో నటించినటువంటి అజయ్ ఘోష్ " అన్ని మన కోసమే చేసుకోకూడదు కొన్ని మన అనుకునే వాళ్ల కోసం కూడా వదులుకోవాలంటూ డైలాగు విసురుతారు.

ఈ ఎమోషనల్ డైలాగ్ ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా రెస్పాన్స్ అందుకున్నది. డీజే టిల్లు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, వంటి అద్భుతమైన చిత్రాలను అందించిన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ ద్వారా మ్యూజిక్ షాప్ మూర్తి(music Shop murthi)మూవీ గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ చిత్రానికి సీనియర్ కెమెరామెన్ బెజుగం శ్రీనివాస్(bejugam srinivas) పనిచేయగా, పవన్ సంగీతాన్ని అందించారు. అలాగే బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్ గా వర్క్ చేశారు. ఇక ఈ సినిమాలో అజయ్ ఘోష్, చాందిని చౌదరి, మరో సీనియర్ హీరోయిన్ ఆమని(amani) అమిత్ శర్మ, భానుచందర్, దయానంద రెడ్డి, తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో అజయ్ ఘోష్ పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. సినిమాను ఆయనే భుజస్కందాలపై మోశారని తెలుస్తోంది.

Tags:
Next Story
Share it