Akhira:అకీరా సినీ ఎంట్రీ..డైరెక్టర్ ఆయనేనట.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా నందన్ కనిపిస్తున్నారు. అంతకుముందు కనీసం ఇంటి నుంచి బయటకు వెళ్ళనటువంటి అకీరా పవన్

Akhira:అకీరా సినీ ఎంట్రీ..డైరెక్టర్ ఆయనేనట.!
X

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా నందన్ కనిపిస్తున్నారు. అంతకుముందు కనీసం ఇంటి నుంచి బయటకు వెళ్ళనటువంటి అకీరా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలుపొందినప్పటినుంచి తన తండ్రితో ప్రతి ప్రోగ్రాంలో కనిపిస్తున్నారు. అంతేకాదు ప్రధాని మోడీ దగ్గరికి పవన్ కళ్యాణ్ తో పాటు అఖీరా వెళ్లారు. అలాగే చంద్రబాబు చిరంజీవి ఫ్యామిలీతో అకిరా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు. ఈ విధంగా ఎన్నడూ బయటకు రాని అఖీరా నందన్ ఇలా కనిపించడంతో చాలామంది ఆలోచన చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వస్తారా లేదంటే సినీ ఎంట్రీ ఇస్తారా అని ఆలోచన చేస్తున్నారు. అయితే ఇదే తరుణంలో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి అఖీరానందన్ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఆయనకు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అయితే అకిరా నందన్(akhira nandan)సినిమా ఎంట్రీ అంటే తన తండ్రి పవన్ కళ్యాణ్ కచ్చితంగా దర్శకత్వ బాధ్యతలు త్రివిక్రమ్ కి(trivikram) అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ పవన్ కళ్యాణ్ అకిరా సినీ ఎంట్రీ బాధ్యతలు త్రివిక్రమ్ కి కాకుండా పూరి జగన్నాథ్ కు అప్పగించారట.

దీని వెనక ఒక స్పెషల్ కథ కూడా ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్(pawankalyan)హీరోగా నటించిన బద్రి(badri) సినిమా పూరి దర్శకత్వంలోనే వచ్చింది. అలాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు రేణు(renu desai)దేశాయ్ కూడా నటించింది. ఈ విధంగా తల్లిదండ్రులు నటించినటువంటి బద్రి సినిమా డైరెక్టర్ మొదటి సినిమాకు దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం ఆయనకు గొప్ప అనుభూతి అని చెప్పాలి. అంతే కాకుండా పూరి జగన్నాథ్(puri jagannath)కొత్తగా హీరోలను ప్రజెంట్ చేయడంలో దిట్ట. బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ యూత్ లో ఎలాంటి కరెక్షన్ ను పెంచుకున్నారు మనందరికీ తెలుసు. ఈ విధంగానే అకిరా కూడా సినిమాల్లో అద్భుతంగా ఎదగడం కోసం పూరి జగన్నాథ్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

Tags:
Next Story
Share it