MOVIES: ఒకప్పుడు ఫేమస్ న్యూస్ రీడర్..ఇప్పుడు పెద్ద సెలబ్రెటీ?

హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ.1985 మే 15న జన్మించింది.2013 నుంచి టెలివిజన్ ప్రజెంటర్ గా, యాంకర్ గా యాక్టివ్ గా ఉన్న అనసూయ ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

MOVIES: ఒకప్పుడు ఫేమస్ న్యూస్ రీడర్..ఇప్పుడు పెద్ద సెలబ్రెటీ?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఒకప్పుడు సాధారణ న్యూస్ రీడర్( NEWS READER) ..ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా ఎదిగింది. ఇప్పుడు సినిమాల్లో బెస్ట్ క్యారక్టర్లు( CHARACTER ARTIST) చేస్తుంది. యాక్టర్ గా , యాంకర్ గా అధ్భుతంగా రాణించుకువస్తుంది అనసూయ. ఈ బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ( ANASUYA) పుట్టిన రోజు సందర్భంగా ఆమె సన్నిహితులు, సినీ ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలిపారు.

హైదరాబాద్ ( HYDRABAD) కు చెందిన ఈ బ్యూటీ.. 1985 మే 15న జన్మించింది. ఈ ఏడాది 35 ఏట అడుగెట్టింది. 2013 నుంచి టెలివిజన్ ప్రజెంటర్( TV PRESENTER) గా, యాంకర్ గా యాక్టివ్ గా ఉన్న అనసూయ( ANASUYA) ... ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి ( DRAKSHAYANI) పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా కనిపించినా ...లుక్ అంత క్లాసీ కాకపోయినా ...మాస్ లుక్ లో చింపేసింది.




అనసూయ నటిస్తున్న కొత్త చిత్రాల్లో ‘సింబా’( SIMHA) ఒకటి. ఈ చిత్రం నుంచి ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను( FIRST LOOK) రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. కోర్టు బోణులో( COURT) నిల్చోని తీర్పుకోసం ఆత్రుతగా ఎదురుచూస్తు్నట్టుగా కనిపిస్తోంది. లీడ్ రోల్ లో అనసూయ నటిస్తున్న మరో మూవీ ‘వాంటెడ్ పండుగాడ్ ( WANTED PANDUGOD): పట్టుకుంటే కోటీ’. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనసూయ క్రేజీ రోల్ ప్లేచేస్తోంది. చేతి చూసి జాతకాలు చెప్పే కోయ అమ్మాయిగా ఆకట్టుకుంటోంది. హ్యాపీ బర్త్ డే రంగమ్మత్త..

Tags:
Next Story
Share it