Anushka: ప్రొడ్యూసర్ తో పెళ్లికి రెడీ అయిన అనుష్క శెట్టి..!

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలోనే పెళ్లి పీటలేకబోతున్నట్టు కన్నడ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అంతేకాదు అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోయేది కూడా

Anushka: ప్రొడ్యూసర్ తో పెళ్లికి రెడీ అయిన అనుష్క శెట్టి..!
X

న్యూస్ లైన్ డెస్క్: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(anushka shetty) త్వరలోనే పెళ్లి పీటలేకబోతున్నట్టు కన్నడ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అంతేకాదు అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోయేది కూడా కన్నడ ప్రొడ్యూసర్ ని అంటూ ఓ ప్రచారం జరుగుతుంది. మరి ఇంతకీ అనుష్క శెట్టి పెళ్లాడబోయే ఆ కన్నడ నిర్మాత ఎవరో ఇప్పుడు చూద్దాం.. అనుష్క శెట్టి తన అందం,అభినయంతో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని తనవైపు తిప్పుకునేలా చేసింది.

తన అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని ఎంతమంది హీరోయిన్ లు వచ్చినా తన స్థానాన్ని టాలీవుడ్లో పదిలం చేసుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్(prabhas) మధ్య గత కొద్ది రోజులుగా ప్రేమాయణం వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఈ విషయంపై అధికారిక క్లారిటీ మాత్రం లేదు. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతుంది అంటూ కన్నడ మీడియాలో ఒక రూమర్ వైరల్ గా మారింది.

అయితే ఇప్పటికే 40 ఏళ్ళు దాటినా అనుష్క శెట్టి ప్రభాస్ కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేసిందని, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంకా తమ కూతురికి పెళ్లి చేయకుండా ఎన్ని రోజులు ఉంచాలి అనే ఉద్దేశంతో కన్నడ నిర్మాతతో అనుష్కకి పెళ్లి ఫిక్స్ చేశారని సమాచారం.అయితే ప్రభాస్(prabhas) కూడా ఇప్పుడే పెళ్లి చేసుకోను అనే ఉద్దేశంతో ఉండేసరికి అనుష్క కూడా ప్రభాస్ కి బ్రేకప్ చెప్పి ఆ కన్నడ నిర్మాతను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది.అయితే ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో కన్నడ నిర్మాతతో అనుష్క పెళ్లి అంటూ ఓ రూమర్ జోరుగా చక్కర్లు కొడుతుంది. మరి అనుష్క పెళ్లి వార్తలు ఇప్పుడైనా నిజమౌతాయా లేక ఎప్పటిలాగే రూమర్ గా మిగిలిపోతాయా అనేది చూడాలి

Next Story
Share it