Balakrishna: బాల‌క్రిష్ణ బర్త్‌డే స్పెషల్ అఖండ 2 సినిమాపై బిగ్‌ అప్‌డేట్‌!

బోయపాటి శ్రీను కాంభినేషన్ లో హిట్ పక్కా.వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయిన విష‌యం తెలిసిందే.

Balakrishna: బాల‌క్రిష్ణ బర్త్‌డే స్పెషల్ అఖండ 2 సినిమాపై బిగ్‌ అప్‌డేట్‌!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలయ్య అంటేనే విజిల్స్ ...మాస్ డైలాగ్స్ . బోయపాటి శ్రీను కాంభినేషన్ లో హిట్ పక్కా.వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయిన విష‌యం తెలిసిందే. త‌ద్వారా ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. దీంతో ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మరో సినిమా ఉంటుందని, అదే 'అఖండ 2' ( AKHANDA2) అని గతంలోనే ప్రకటించారు.

ఇవాళ (సోమ‌వారం) బాల‌క్రిష్ణ బ‌ర్త్‌డే( BALAYYA BIRTHDAY) సంద‌ర్భంగా బాలయ్య, బోయపాటి సినిమా బిగ్‌ అప్‌డేట్ వ‌చ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాను మేక‌ర్స్‌ ప్రకటించారు. బీబీ4 వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్ విడుద‌ల‌ చేసింది మూవీ టీం.

ఈ మూవీలో బాలయ్య కూతురు తేజస్విని ( TEJASWINI) కూడా నిర్మాతగా భాగమవుతున్నారు. తేజస్విని గతంలో బాలయ్య అన్ స్టాపబుల్ షోకు కూడా పనిచేసిన విష‌యం తెలిసిందే. ఇక పై పూర్తి సినిమారంగంలోనే సెటిల్ అవ్వడానికి రెడీ అవుతుంది. హిందుపురం గెలుపుతో..బాలయ్య అఖండ 2 మరింత రెట్టింపు ఉత్సాహాంతో పనిచేస్తారంటున్నారు నెటిజన్లు.

Tags:
Next Story
Share it