Balakrishna: సిల్లీ రీజన్ తో సమరసింహారెడ్డి మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్..?

బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీలలో సమరసింహారెడ్డి మూవీ ఒకటి.. ఈయన నటించిన ఈ సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఎంతో ఇష్టం అని ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలలో చిరు

Balakrishna: సిల్లీ రీజన్ తో సమరసింహారెడ్డి మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్..?
X

న్యూస్ లైన్ డెస్క్: బాలకృష్ణ (Balakrishna) బ్లాక్ బస్టర్ మూవీలలో సమరసింహారెడ్డి మూవీ ఒకటి.. ఈయన నటించిన ఈ సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి కూడా ఎంతో ఇష్టం అని ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలలో చిరు కూడా బయటపెట్టారు.అయితే అలాంట ఈ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ అవకాశాన్ని ఒక సిల్లీ రీజన్ తో మిస్ చేసుకుంది ఒక స్టార్ హీరోయిన్..

మరి సమరసింహారెడ్డి మూవీ(Samarasimha Reddy movie) లో హీరోయిన్ అవకాశాన్ని మిస్ చేసుకున్న ఆ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం.. బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ,సిమ్రాన్,అంజలా జవేరి(Anjala zaveri) నటీనటులు గా చేసిన సమరసింహారెడ్డి మూవీ 1999 జనవరి 13 న సంక్రాంతి బరిలో నిలిచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ సినిమా ఆరు కోట్ల బడ్జెట్ తో తీస్తే 16 కోట్లు వసూలు చేసి బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఈ మూవీ మూడు థియేటర్లలో 227 రోజులు 29 థియేటర్లలో 175 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ అవకాశం ముందుగా నటి రాశి(Rasi) కి వచ్చిందట.


కానీ ఈ సినిమాలో ఒకచోట సీతాకోకచిలుక సన్నివేశం ఉంటుంది.అయితే ఈ సన్నివేశం నచ్చలేదని హీరోయిన్ రాశి ఈ మూవీ నుండి తప్పుకుందట. అయితే ఈ సినిమా కోసం ముందుగా రాశి, అంజలా జవేరి, సంఘవి(Sanghavi) లను అనుకున్నారట.కానీ రాశి రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా సిమ్రాన్(Simran) , అంజలా జవేరి లతో తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు డైరెక్టర్ బి. గోపాల్.. ఇక ఈ సినిమాకి గానూ డైరెక్టర్ బి.గోపాల్ కి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది

Tags:
Next Story
Share it