BB4లో బాలయ్య కూతురు..!

నందమూరి బాలకృష్ణ(BALAKRISHNA )ఈయన అంటే తెలియని వారు ఉండరు. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి హీరో. అలాంటి

BB4లో బాలయ్య కూతురు..!
X

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి బాలకృష్ణ(BALAKRISHNA )ఈయన అంటే తెలియని వారు ఉండరు. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి హీరో. అలాంటి బాలకృష్ణ తాజాగా హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో చూపించారు. ప్రస్తుతం ఆయన సినిమాలపై మళ్లీ దృష్టి పెట్టబోతున్నారు. కట్ చేస్తే గత కొంతకాలం నుంచి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ(MOKSHAGNA) సినిమాల్లోకి రాబోతున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ విషయాలను మాత్రం బయటకు ప్రకటించడం లేదు.

ఇదే తరుణంలో ఆయన యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారని అది అయిపోయిన తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా కొడుకుకు బదులు తన కూతురుని ఇండస్ట్రీలోకి పరిచయం చేస్తున్నారు బాలకృష్ణ. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందనేది మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి జూన్ 10వ తేదీన ఆ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు.

ఆ మూవీ పేరు BB4 ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తూ ఉండగా దీనికి నిర్మాణ బాధ్యతలన్నీ బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినికి(TEJASWINI) అప్పగించారట. ఇదే తరుణంలో ఈ సినిమా నిర్మాతగా ఆమె పేరును కూడా ప్రకటించారు. ఇలా కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారంటే అనూహ్యంగా బిడ్డను నిర్మాతగా ఇండస్ట్రీలోకి పరిచయం చేయడం చాలా ఆశ్చర్యకరంగా మారింది. మరి బిబి 4 ఎలాంటి హిట్ అవుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇప్పటికే వీరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు వచ్చి అద్భుత విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:
Next Story
Share it