Noel: బిగ్ బాస్ ఓ చెత్త షో.. సింగర్ నోయల్ షాకింగ్ కామెంట్స్..!!

సింగర్ నోయల్ అంటే సినీ ప్రియులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయన ఎన్నో సినిమాలకు ర్యాప్ సాంగ్స్ అలాగే కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా చేశారు.అలాంటి సింగర్

Noel: బిగ్ బాస్ ఓ చెత్త షో.. సింగర్ నోయల్ షాకింగ్ కామెంట్స్..!!
X

న్యూస్ లైన్ డెస్క్: సింగర్ నోయల్ (Singer Noel) అంటే సినీ ప్రియులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయన ఎన్నో సినిమాలకు ర్యాప్ సాంగ్స్ అలాగే కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా చేశారు.అలాంటి సింగర్ నోయల్ బిగ్ బాస్ 4 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లోకి వెళ్ళిన ఈయన అనారోగ్య సమస్యల కారణంగా హౌస్ నుండి బయటకు వచ్చారు.

అయితే బిగ్ బాస్ కి వెళ్లివచ్చాక అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు..బిగ్ బాస్ కి వెళ్లిన వారిలో కొంతమందికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. మిగతా వారందరూ ఇండస్ట్రీలో కనుమరుగైపోతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ నోయల్ బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఓ చెత్త షో.. ఆ షోలోకి వెళ్లడానికి ఎందుకు అంతలా పాకులాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.అంతే కాదు బిగ్ బాస్ లో అవకాశం వస్తే రాజమౌళి (Rajamouli) సినిమాలో అవకాశం వచ్చిన దానితో పోలుస్తున్నారు.

రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే స్టార్ అయ్యి మిగతా సినిమాల్లో కూడా అవకాశాలు వస్తాయి. కానీ బిగ్ బాస్ (Biggboss) లోకి వెళ్తే మాత్రం ఒక్క అవకాశం కూడా రాదు.బిగ్ బాస్ ఒక గొడవలు పడే షో.. ఇందులో అందరినీ తొక్కుకుంటూ వచ్చినవాడే హీరో అవుతాడు. పక్కవాడిని తొక్కినవాడు హీరో ఎలా అవుతాడు.మళ్లీ హౌస్ లో నుండి బయటికి పంపేందుకు సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు నాకు ఇష్టమైన పప్పు వండలేదు ఆ కర్రీ బావండలేదు అని సిల్లీ రిజన్స్ చెప్పి నామినేట్ చేస్తారు.

బిగ్ బాస్ హౌస్లో 100 రోజులు ఉండడం వల్ల వారి వ్యక్తిత్వం బయటపడుతుంది.అలాంటప్పుడు బయటకు వచ్చాక వారి వ్యక్తిత్వాన్ని చూసినవాళ్లు అవకాశాలు ఎలా ఇస్తారు.. అంతేకాదు అప్పటివరకు ఎవరికైతే అభిమానులుగా ఉంటారో వారిని ద్వేషిస్తారు. దాంతో అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అందుకే బిగ్ బాస్ లోకి వెళ్లడం వేస్ట్..అది ఒక చెత్త షో అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నోయల్(Noel)

Tags:
Next Story
Share it