Anand Deverakonda: ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన ఆనంద్ దేవరకొండ కానీ..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(anand devarakonda) తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ దొరసాని అనే మూవీతో తెలుగు చిత్ర

Anand Deverakonda: ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన ఆనంద్ దేవరకొండ కానీ..!!
X

న్యూస్ లైన్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(anand devarakonda) తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ దొరసాని అనే మూవీతో తెలుగు చిత్ర సీమ రంగానికి పరిచయమయ్యారు.అయితే ఈయనకు మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ మంచి హిట్ ఇచ్చింది.ఇక గత సంవత్సరం వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈ సినిమాలోని ఆనంద్ నటన ఈ మూవీ కి ప్లస్ అయ్యింది.ఒకరకంగా బేబీ మూవీ ఆనంద్ దేవరకొండ కి లైఫ్ ఇచ్చిన మూవీగా మారిపోయింది.

అయితే ఆనంద్ దేవరకొండ గురించి ఈ విషయం తెలిస్తే మాత్రం బేబీ(baby) సినిమాలో అంత బాగా నటించడానికి ఇదే కారణం అని అనుకుంటారు.ఎందుకంటే ఆనంద్ దేవరకొండ లవ్ లో ఫెయిల్ అయ్యారట. అవును మీరు వింటున్నది నిజమే..ఆయన చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోయారట. ఇక ఆ అమ్మాయి చదువు కోసం అమెరికాకు వెళితే.. ఆయన కూడా ఆ అమ్మాయి కోసం అలాగే అమెరికాలో లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలి అనే కోరికతో అక్కడ ఉండే టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ కోసం అప్లై చేసి సీట్ రాగానే చికాగో వెళ్లిపోయారట.

అయితే అక్కడికి వెళ్ళాక తన లవ్ ఇంకా సింపుల్ అయిపోతుందని,ఆ అమ్మాయితో స్వేచ్ఛగా తిరగవచ్చని అనుకున్నారట. కానీ తీరా అమెరికాకు వెళ్లాక తన హార్ట్ బ్రేక్ అయిందని,మొత్తం రివర్స్ అయిందని, తనకు బ్రేకప్ జరిగిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ప్రేమ కోసం వెళ్ళిన తాను బ్రేకప్ జరగడంతో దాదాపు నాలుగు సంవత్సరాల వరకు ఆ బ్రేకప్ నుండి కోలుకోలేదని, కానీ చివరికి ఆ భాధ లో నుండి బయటపడి బాగా చదివి మంచి జాబ్ సంపాదించారట. అలాగే సంవత్సరానికి 40 లక్షల సాలరీ వచ్చే ఒక జాబ్ లో జాయిన్ అయ్యాక,చివరికి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇండియాకి తిరిగి వచ్చేసారట

Tags:
Next Story
Share it