Chandrababu: ప్రమాణ స్వీకారానికి రాబోతున్న తారలు వీళ్లే..!

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు గురించి ప్రస్తుతం ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి

Chandrababu: ప్రమాణ స్వీకారానికి రాబోతున్న తారలు వీళ్లే..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు(Nara CHANDRABABU naidu) గురించి ప్రస్తుతం ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి.ఈయన ఈరోజు అనగా జూన్ 12న 11:27 నిమిషాలకు గన్నవరం కేసరపల్లి ఐటి పార్కులో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఎంతోమంది ప్రముఖులతో పాటు నరేంద్ర మోడీ (Narendra modi) అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది తారాగణం ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నట్లు తెలుస్తోంది.మరి ప్రమాణ స్వీకారానికి రాబోతున్న తారాలు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూటమిలో ప్రధాన భాద్యత వహించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నబోతున్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తోపాటు ఆయన భార్య సురేఖ అలాగే కొడుకు రామ్ చరణ్,మనవరాళ్లు, కూతుర్లు కూడా ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్నారట

.ఇక ఇప్పటికే బాలకృష్ణ (Balakrishna) ఫ్యామిలీ మొత్తం విజయవాడకు వచ్చేసారట.వీళ్లే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా ఈప్రమాణ స్వీకారానికి రాబోతున్నట్టు తెలుస్తోంది.అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందని నిన్న మొన్నటిదాకా ప్రచారం జరిగినా కూడా ఆయన టీం దీన్ని కొట్టి పారేసి ఆయనకు ఆహ్వానం అందలేదని చెబుతుందట. అంతేకాకుండా అల్లు అర్జున్ కి కూడా ఆహ్వానం అందిందని ఆయన కూడా రాబోతున్నట్టు సమాచారం. వీళ్లే కాకుండా ప్రభాస్, మహేష్ బాబు(Mahesh babu) వంటి హీరోలకు కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఇక ఒకే వేదికపై ఎంతోమంది భారీ తారాగణాన్ని మనం చూడవచ్చని తెలుస్తోంది

Tags:
Next Story
Share it