Chiranjeevi: చిరంజీవికి నాగబాబు అంటే అంత పగా.. ఏం చేశాడంటే..?

ఏంటి మెగాస్టార్ చిరంజీవికి(chiranjeevi) నిజంగానే తమ్ముడు నాగబాబు అంటే ఇష్టం లేదా.. ఎందుకు చిరంజీవి నాగబాబు విషయంలో అలాంటి పని చేశారు.. నాగబాబుపై అంత పగ ఎందు

Chiranjeevi: చిరంజీవికి నాగబాబు అంటే అంత పగా.. ఏం చేశాడంటే..?
X

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి మెగాస్టార్ చిరంజీవికి(chiranjeevi) నిజంగానే తమ్ముడు నాగబాబు అంటే ఇష్టం లేదా.. ఎందుకు చిరంజీవి నాగబాబు విషయంలో అలాంటి పని చేశారు.. నాగబాబుపై అంత పగ ఎందుకు అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.. ఇక అసలు విషయం ఏమిటంటే.. నాగబాబుపై చిరంజీవి కోపం పెట్టుకున్నారు.. పగ పెంచుకున్నారు అంటే అది ఈ ఏజ్ లో కాదు..చిన్నతనంలో.. రీసెంట్ గా చిరంజీవి తాను ఇంటర్మీడియట్ చదివే సమయంలో నాగబాబుతో(nagababu) జరిగిన ఓ గొడవ గురించి బయటపెట్టారు. చిరంజీవి మాట్లాడుతూ..

నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాగబాబు ఆరో తరగతో,ఏడవ తరగతో చదువుతున్నాడు. అయితే ఆ రోజుల్లో నేను మా అమ్మకి చాలా హెల్ప్ చేసేవాడిని. ఇక ఓ రోజు నేను పని మీద బయటకు వెళ్తూ నాగబాబుని లాండ్రీకి ఇచ్చిన బట్టలు తీసుకు రమ్మని చెప్పాను. కానీ నాగబాబు మాత్రం నా మాటలు పట్టించుకోకుండా లాండ్రీకి ఇచ్చిన బట్టలు తీసుకురాలేదు.ఇక నా పని ముగించుకొని ఇంటికి వచ్చేసాక లాండ్రి నుండి బట్టలు తెచ్చావా అని నాగబాబుని అడిగితే తేలేదు అని కాస్త విసుగ్గా సమాధానం చెప్పాడు. ఇక కోపంతో ఎందుకు తేలేదు అని గట్టిగా నేను అడిగాను.

దానికి నాగబాబు మరింత చిరాకుగా నేను ఆ టైంలో పడుకున్నాను అంటూ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో కోపంతో ఊగిపోయిన నేను నాగబాబుని చితక్కొట్టాను. నేను నాగబాబుని కొట్టడం చూసి మా అమ్మ పరిగెత్తుకు వచ్చి తమ్ముడిని అలా కొడతావా అని నన్ను తిట్టింది. ఇక తర్వాత నైట్ నాన్న వచ్చాక జరిగిన విషయం మొత్తం ఏడ్చుకుంటూ చెప్పడంతో నాగబాబుని నాన్న తిట్టారు. ఇక నాన్న తిట్టడంతో నా కోపం మొత్తం చల్లారిపోయింది..అంటూ అప్పుడు జరిగిన ఫన్నీ విషయాన్నీ చిరంజీవి తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి నాగబాబు గురించి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Tags:
Next Story
Share it