KALKI: కల్కీ సినిమాలో దీపికా రెమ్యురేషన్ ఎంతో తెలుసా?

KALKI MOVIE ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు అమ్మడు గట్టిగానే రెమ్యూనిరేషన్ తీసుకుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

KALKI: కల్కీ సినిమాలో  దీపికా రెమ్యురేషన్ ఎంతో తెలుసా?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బాహుబలి ప్రభాస్ తో యాక్ట్ చెయ్యడానికి రెడీ అయ్యింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు అమ్మడు గట్టిగానే రెమ్యూనిరేషన్ తీసుకుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. లాస్ట్ ఇయర్ షారూఖ్ ఖాన్‌తో( SHARUKH KHAN) న‌టించిన ప‌ఠాన్ ( PATAN)చిత్రం ఎంత‌టి విజ‌యాన్ని అందించిందో తెలిసిందే. తాజాగా ఫైటర్ సినిమాతో మ‌రోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మ‌డు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.

క‌ల్కి2898 AD సినిమాలో ఈ బ్యూటీనే న‌టిస్తోంది. ఇది పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తున్న చిత్రం. అసలే ప్రభాస్( PRABHAS బడ్జెట్ ఎంత గట్టిగా ఉంటుందో..రెమ్యూనిరేషన్ కూడా అంతే గట్టిగా ఉంటంది.ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ ( NAGASHWIN) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కల్కి(KALKI) సినిమా కోసం దీపికా ప‌దుకోణే ఏకంగా రూ.20 కోట్లు పారితోషికం తీసుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ఇది ఆమె కేరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అని కూడా ఇదేనట . గతంలో ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాల్లో ఒక్కో సినిమాకు రూ.12 నుండి రూ.15 కోట్ల వరకు రెమ్యూన‌రేషన్ తీసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే, కల్కి సినిమా కోసం మాత్రం రూ.20 కోట్లు తీసుకోవడం ఇప్ప‌డు సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక‌, ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ చాలామంది న‌టిస్తున్నారు. అందులో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ వంటి వారున్నారు. క‌ల్కి చిత్రం మే 9న అభిమానుల ముందుకు రానుంది.

Tags:
Next Story
Share it