Siddhu Jonnalagadda: ఆ హీరో వల్లే సిద్ధు జొన్నలగడ్డ స్టార్ అయ్యారా..?

డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు సిద్దుజొన్నలగడ్డ. ఇక ఈ సినిమాకి ముందు ఎన్ని సినిమాల్లో నటించినా కూడా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో సిద్దుకు

Siddhu Jonnalagadda: ఆ హీరో వల్లే సిద్ధు జొన్నలగడ్డ స్టార్ అయ్యారా..?
X

న్యూస్ లైన్ డెస్క్: డీజే టిల్లు సినిమా(DJ Tillu Movie) తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు సిద్దుజొన్నలగడ్డ. ఇక ఈ సినిమాకి ముందు ఎన్ని సినిమాల్లో నటించినా కూడా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో సిద్దుకు వచ్చింది అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన డి జె టిల్లు మూవీ విమల్ కృష్ణ దర్శకత్వంలో 2022లో వచ్చింది.సిద్దు జొన్నలగడ్డ, నేహ శెట్టి(Neha shetty) కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎంతోమంది యూత్ ని ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

దాంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలి అని చిత్ర యూనిట్ భావించింది.అలా ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ (Tillu Square) కూడా 2024 మార్చి 29న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు వెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతూ సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) కి మంచి గుర్తింపు తీసుకువచ్చి పెడుతోంది. ఇక టిల్లు స్క్వేర్ సినిమాలో రాధిక శెట్టి కేవలం అతిథి పాత్రకే పరిమితమైంది. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ని తీసుకున్నారు. ఇక ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ అనుపమ బోల్డ్ రొమా** చేశారు.

ఇదిలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణం ఆ హీరోనే అంటూ తాజాగా నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతోంది.అసలు విషయం ఏమిటంటే.. డీజే టిల్లు సినిమాని ముందుగా మరో హీరోతో తీయాలి అనుకున్నారట చిత్ర యూనిట్.ఇక ఆ హీరో ఎవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ (Vijay deverakonda) కి ముందుగా డిజె టిల్లు సినిమా స్టోరీ చెప్పారట. కానీ అప్పటికే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా(Arjun Reddy Movie) లో చేసి ఉన్నారు.


ఇక సినిమా తర్వాత మళ్లీ అలాంటి కథతోనే వస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది అని ఈ సినిమాని విజయ్ దేవరకొండ (Vijay deverakonda) రిజెక్ట్ చేశారట. అలా విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేయడంతో ఈ స్టోరీ కాస్త సిద్దు చేతికి వచ్చింది. అయితే ఒకవేళ విజయ్ గనుక ఈ సినిమా చేసి ఉంటే సిద్దుకి ఇంత నేమ్,ఫేమ్ వచ్చేది కాదు.ఇక పరోక్షంగా చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ వల్లే సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) స్టార్ అయ్యారు అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక త్వరలోనే టిల్లు స్క్వేర్ కి సీక్వల్ గా టిల్లు క్యూబ్ మూవీ కూడా రాబోతుందని చెప్పారు సిద్దు

Tags:
Next Story
Share it