Vamsi: నేను సినిమాను ప్రేమిస్తే..నా భార్య గోదావరిని ప్రేమించింది

కొత్త సినిమా మొదలైంది .. ఇప్పుడు కుదరదని అంటే, అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కొన్ని వందల సార్లు గోదావరిని చూపించమని అడిగింది .

Vamsi: నేను సినిమాను ప్రేమిస్తే..నా భార్య గోదావరిని ప్రేమించింది
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దర్శకుడు వంశీ( VAMSI) తన సినిమా జీవితం ..వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోస్ చాలా షేర్ చేసుకుంటారు. రీసెంట్ గా తన భార్య 'లచ్చ' ( Lacha)గురించి మాట్లాడారు. "మా పెళ్లి అయిన తరువాత చాలా చిన్న వయసులోనే నాతో పాటు మద్రాస్ వచ్చింది నా భార్య లచ్చ. గోదావరి( godavari) పుష్కరాలకు( pushkarlu) పట్టిసీమ( pattisema) తీసుకుని వెళ్లమని అడిగింది. కొత్త సినిమా మొదలైంది .. ఇప్పుడు కుదరదని అంటే, అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కొన్ని వందల సార్లు గోదావరిని చూపించమని అడిగింది . చిన్న కోరికే కాని ఎందుకో కుదర్లేదు..పని ఒత్తిడితో ఎప్పుడు దాటేసాను.

శ్రీరామనవమి( srirama navami) సమయంలో 'భద్రాచలం తీసుకుని వెళ్లమని అడిగింది. గోదావరిలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటానని అడిగింది. ఆ తరువాత గండిపోచమ్మ తీర్థం .. ధవళేశ్వరం స్వామి కళ్యాణం( DAVALESWARAM SWAMI KALYANAM) .. తాను అడిగినా, ఏదో ఒక ఇబ్బంది కారణంగా నేను తీసుకుని వెళ్లడం కుదరలేదు" అని అన్నారు. "నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా పట్టించుకోని నా భార్య, గోదావరి( GODAVARI) గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మాత్రం పని మానేసి మరీ వినేది. ఎందుకో తనకు ఆ గోదావరి అంటే అంత ప్రేమ. కాని ఎప్పుడు చూపించలేకపోయాను. ఆఖరికి తన అస్థికలు గోదావరి లో కలిపినపుడు మాత్రం చాలా బాధగా అనిపించిందంటు తన బాధను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. తన భార్య చనిపోయిన తర్వాత వంశీ తన ఒంటరితనాన్ని ఇలా సోషల్ మీడియా..నెటిజన్లు ...సినిమాలతో పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు భార్య చనిపోతే...మీకే తెలియకుండా మీ జీవితం శూన్యం అయిపోతుందని బాధపడ్డారు.

Tags:
Next Story
Share it