Bunny: బన్నీ పనికిమాలినోడు అవుతాడని అల్లు రామలింగయ్య ఏం చేశాడో తెలుసా.?

ఏంటి అల్లు రామలింగయ్య బన్నీ పెరిగి పెద్దయ్యాక పనికిమాలినోడు అవుతాడని అలాంటి పని చేశారా? ఎందుకు అల్లు రామలింగయ్య తన మనవడు బన్నీని అంత తక్కువ అంచనా వేశాడు

Bunny: బన్నీ పనికిమాలినోడు అవుతాడని అల్లు రామలింగయ్య ఏం చేశాడో తెలుసా.?
X

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) బన్నీ పెరిగి పెద్దయ్యాక పనికిమాలినోడు అవుతాడని అలాంటి పని చేశారా? ఎందుకు అల్లు రామలింగయ్య తన మనవడు బన్నీని అంత తక్కువ అంచనా వేశాడు అనే సంగతి ఇప్పుడు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం..తెలుగు సినీ చరిత్రలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు రామలింగయ్య మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు అల్లు అర్జున్(Allu Arjun) .

అయితే ఈయన చిన్నతనంలో చాలా చిలిపి పనులు చేస్తూ ఎంతో అల్లరి చేసేవారట. ఇక బన్నీ (Bunny) అల్లరి చూసిన అల్లు రామలింగయ్య వీడు పెద్దయ్యాక కూడా ఇలాగే తయారవుతాడు కావచ్చు.. నా మనవలు మనవరాళ్లు అందరూ మంచి మంచి పొజిషన్లోకి వెళ్తారు. వీడు మాత్రం ఎందుకు పనికిరాని వాడు అవుతాడు.అందుకే వీడి కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని భావించి అప్పట్లో 10 లక్షలు అల్లు అర్జున్ పేరు మీద ఫిక్స్ చేశారట.ఎందుకంటే బన్నీ ఎందుకు పనికిరాడని ఒకవేళ పెద్దయ్యాక ఈ 10లక్షలు వస్తే ఆ 10 లక్షల తోనైనా ఏదైనా బిజినెస్ చేసుకొని బతుకుతాడనే ఉద్దేశంతో అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) అలా చేశారట.

ఇక ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ (Allu Arjun) తన తాత అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల్లో భాగంగా చెప్పుకొచ్చారు.ఇక ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది అల్లు అభిమానులు ఇప్పుడు గనక అల్లు రామలింగయ్య బతికుంటే తన మనవడిని చూసి ఎంతగా మురిసిపోయేవారో..ఇప్పుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీ గర్వించదగ్గ హీరోగా మారారు. ఇప్పటివరకు తెలుగులో ఎవరు కూడా అందుకొని జాతియ ఉత్తమ నటుడి అవార్డు (National Best actor award) ను సైతం అందుకోగలిగారు అంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు

Tags:
Next Story
Share it