Pawan: అన్నయ్యని అవమానించిన హీరోని పవన్ ఏం చేశారో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్నయ్య చిరంజీవి అంటే ఎంత పిచ్చి ప్రేమో చెప్పనక్కర్లేదు.పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఎవరైనా ఏదైనామాట అంటే కూడా అస్సలు ఊరుకోరు.పవన్ సినిమా

Pawan: అన్నయ్యని అవమానించిన హీరోని పవన్ ఏం చేశారో తెలుసా..?
X

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) కి అన్నయ్య చిరంజీవి అంటే ఎంత పిచ్చి ప్రేమో చెప్పనక్కర్లేదు.పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఎవరైనా ఏదైనామాట అంటే కూడా అస్సలు ఊరుకోరు. పవన్ సినిమాల్లోకి రాకముందు చిరంజీవి చెన్నైలో ఓ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు వీధి రౌడీలు బెదిరించడంతో ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే వారికి వార్నింగ్ ఇచ్చి తీవ్రంగా కొట్టారట అలా చిరంజీవి మీద అస్సలు మాట పడనివ్వరు. ఇక ఈ మధ్యన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో విజయోత్సాహంలో అన్నయ్య ఇంటికి వెళ్లి ఒక్కసారిగా చిరంజీవి పాదాలపై పడి మొక్కిన సంగతి మనకు తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే అప్పట్లో ఓ ఈవెంట్ జరుగుతున్న సమయంలో చిరంజీవి(Chiranjeevi) ని ఓ పెద్ద హీరో అవమానించారట. దాంతో పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా మరి ఆయన ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అప్పట్లో మోహన్ బాబు ఓ ఈవెంట్లో చిరంజీవిని తక్కువ చేస్తూ మాట్లాడారు. మోహన్ బాబు స్టేజ్ పై మాట్లాడుతూ నేను తిరుపతిలో చదువుకునే సమయంలో చిరంజీవి సినిమాలు చూస్తూ ఉండేవాడిని.. అంటే చిరంజీవి వయసులో నాకంటే చాలా పెద్దవాడు సీనియర్ అంటూ కాస్త అవమానించినట్టు మాట్లాడారు. ఇక మోహన్ బాబు (Mohan babu) మాటలకు చిరంజీవి ఏం మాట్లాడాలో తెలియగా కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూనే అందరూ ఏమనుకుంటారోనని నవ్వారు


అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి పవన్ కళ్యాణ్(Pawan kalyan) స్టేజ్ ఎక్కి మోహన్ బాబుని తమ్ముడు అంటూ పిలిచి తన అన్న నీ అవమానించినందుకు రివేంజ్ తీర్చుకున్నారు. తమ్ముడు నువ్వంటే నాకు చాలా ఇష్టం.నీ సినిమాలు అంటే నీ యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం.నీ క్రమశిక్షణ అంటే ఇంకా ఇంకా ఇష్టం అంటూ స్టేజ్ పైనే పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఈలలు వేశారు. అలా ఆరోజు ఆ ఈవెంట్లో మోహన్ బాబు(Mohan babu) చేసిన పనికి పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో ఇది చాలా వైరల్ అయింది. అయితే తాజాగా మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


Tags:
Next Story
Share it