నగ్మా రమ్యకృష్ణ మధ్య ఉన్న జ్యోతిష్కుడిని గుర్తుపట్టారా..?

ఈ మధ్యకాలంలో చాలామంది ఫేమస్ సెలబ్రిటీలు వారికి సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

నగ్మా రమ్యకృష్ణ మధ్య ఉన్న జ్యోతిష్కుడిని గుర్తుపట్టారా..?
X

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలామంది ఫేమస్ సెలబ్రిటీలు వారికి సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ విధంగానే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందినటువంటి జ్యోతిష్కుడు తనకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. మరి ఆ ఫోటో ఏంటి అది ఎప్పుడు దిగారు.. అందులో ఉన్న జ్యోతిష్కుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల యొక్క జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు వేణు స్వామి.(venuswamy) ఈయన చెప్పిన విషయాలు ఇండస్ట్రీలో చాలా వరకు జరుగుతున్నాయి. అంతేకాకుండా చాలామంది హీరోయిన్లు ఈయన దగ్గర పూజలు చేయించుకుని కెరియర్ లో దూసుకుపోతున్నారు. ఈ విధంగా టాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయినటువంటి వేణు స్వామి తాను యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి సినిమాలకు సంబంధించి ముహూర్తాలు, ప్రొడక్షన్ పనులు చూసుకునేవారు. అయితే 1993లో ముగ్గురు మొనగాళ్లు(mogguru monagallu)సినిమా సమయంలో వేణు స్వామి నగ్మా(nagma) అలాగే రమ్యకృష్ణ(ramya krishna)లతో కలిసి దిగినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

https://www.instagram.com/reel/C2MR3dfRcMp/?utm_source=ig_web_button_share_sheet

ఈ టైంలో వేణు స్వామి యుక్త వయసులో ఉన్నారు. అప్పుడు దిగినటువంటి ఒక ఫోటోను ఈ మధ్యకాలంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడైనటువంటి శ్యామ్ 1989 నుండి వేణు స్వామికి సంబంధించిన కొన్ని ఫోటోలతో ఒక వీడియో తయారు చేశారట. ఆ వీడియోను వేణు స్వామి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకోవడంతో ఈ ఫోటో బయటకు వచ్చింది. వేణు స్వామికి చిన్నప్పటినుంచే ఇండస్ట్రీ తో పరిచయాలు ఉన్నాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాకుండా వేణు స్వామి ఆ టైంలో చాలా సన్నగా చిన్న పిల్లాడిలా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Tags:
Next Story
Share it