ఈ ఫోటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా.. చిన్న ఏజ్ లోనే స్టార్ అయింది..!

ఒకప్పుడు ఇండస్ట్రీలో తన అంద చందాలతో ఓ మెరుపు మెరిసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కేవలం 15 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా చేసింది.

ఈ ఫోటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా.. చిన్న ఏజ్ లోనే స్టార్ అయింది..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు ఇండస్ట్రీలో తన అంద చందాలతో ఓ మెరుపు మెరిసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కేవలం 15 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని చిరంజీవి(chiranjeevi) బాలకృష్ణ(balakrishna) వంటి తరం హీరోలు అందరితో తెరను పంచుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ, వంటి అన్ని భాషల్లో ఈమె నటించి మెప్పించింది.

దాదాపు అన్ని భాషలు కలిపి 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ పేరే రంభ(Ramba). అతి చిన్న వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుస అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలోని బిజీ హీరోయిన్ గా మారిపోయింది. హీరో వినీత్ తో జోడీగా స్వర్గం(swargam) అనే మలయాళం సినిమా ద్వారా 1992లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, ఆ సినిమా చేసే సమయంలో 15 సంవత్సరాల వయసు ఉందట.


ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో 1993లో ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది. ఆ విధంగా వరుస అవకాశాలు అందుకుంటూ స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ రంభ ఇండస్ట్రీలోనే దూసుకుపోయింది. ఆ తర్వాత 2010లో బిజినెస్ మ్యాన్ ఇంద్ర కుమార్ పద్మనాభన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చింది. ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

Tags:
Next Story
Share it