eric: ఫస్ట్ టైం కలిసినపుడు షారుఖ్‌ ఖాన్ తెలీదు : ఎరిక్‌ గార్సెట్టీ

మెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టీ(Eric Garcetti ) 2023 మేలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను కలిసారు. షారుఖ్ ఖాన్ ఎవరో తెలీదు అప్పుడు...ఇప్పుడు మాత్రం భలే ఇష్టమట.

eric: ఫస్ట్ టైం కలిసినపుడు షారుఖ్‌ ఖాన్ తెలీదు : ఎరిక్‌ గార్సెట్టీ
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అమెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టీ(Eric Garcetti ) 2023 మేలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను కలిసారు. అయితే తను మొదటిసారిగా తాను షారుఖ్‌ ఖాన్ ను కలిసినప్పుడు అతనెవరో తెలియదని తర్వాత తర్వాత అతని క్రేజీ చూసి భలే హ్యాపీ గా అనిపించిందన్నారు.

”నేను ఫారుఖ్‌ను(sharuk khan) ముంబయిలోని ( mumbai) అతడి నివాసం మన్నత్‌లో మొదటిసారి కలిసినప్పుడు మేము క్రికెట్ గురించి చర్చించుకున్నాం అని తెలిపారు. ఎందుకంటే ఆయన లాస్‌ ఏంజిల్స్‌ జట్టులో ఓ భాగానికి యజమానిగానే నాకు తెలుసు అని అన్నారు. ఇక్కడ చూస్తే షారుఖ్ డ్యాన్స్ , యాక్టింగ్ గ్రేస్ ఫుల్ యాటిట్యూడ్ తో తెగ నచ్చేశారన్నారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను చూసినప్పుడు మా కార్యాలయంలోని వారంతా ఆశ్యర్యపోయారు అని ఎరిక్‌ గార్సెట్టీ అన్నారు.

మీరు ఎవరిని కలిశారో తెలుసా.. అతను ఇండియాలోని ప్రముఖ నటుల్లో ఒకరు అని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను అని అన్నారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న పాపులారిటీని, ఫ్యాన్స్ ను చూసి షాక్‌ అయ్యాను.”అని పేర్కొన్నారు. 2023 మేలో షారూఖ్‌ను, ఎస్‌ఎస్‌ రాజమౌళిని కలిసినట్లు అప్పట్లోనే గార్సెట్టీ తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో తన పిక్స్ తో పాటు షారుఖ్ తో కలిసి ఉన్నపుడు తను ఎంత హ్యాపీగా ఉంటాడో తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఫుల్ వైరల్ అవుతుంది కూడా.



Tags:
Next Story
Share it