Family star : నిరాశపర్చిన విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' అడ్వాన్స్ బుకింగ్స్!

ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈయన సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం, ఓపెనింగ్స్ రావడం వంటివి మనం ఆయన గత సినిమాలన్నిటికీ చూసాము.

Family star : నిరాశపర్చిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అడ్వాన్స్ బుకింగ్స్!
X

న్యూస్ లైన్ డెస్క్: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈయన సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం, ఓపెనింగ్స్ రావడం వంటివి మనం ఆయన గత సినిమాలన్నిటికీ చూసాము. కానీ దురదృష్టం కొద్దీ ఆ సినిమాలన్నీ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. వాటి ఫలితాల ప్రభావం ఆయన లేటెస్ట్ చిత్రం 'ఫ్యామిలీ స్టార్' మీద పడింది. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో మొదలయ్యాయి. అయితే బుకింగ్స్ గ్రాస్ మాత్రం అనుకున్న స్థాయి లో లేవు. హైదరాబాద్ ప్రాంతం లో ఈ చిత్రానికి కేవలం 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

విజయ్ దేవరకొండ గత చిత్రం 'ఖుషి' కి హైదరాబాద్ లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు కోట్ల 40 లక్షల రూపాయిలు వచ్చాయి. కానీ 'ఫ్యామిలీ స్టార్' కి అందులో సగం కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సినిమాకి పరుశురాం పెట్ల దర్శకత్వం వహించారు. గతం లో ఆయన విజయ్ దేవరకొండ తో 'గీత గోవిందం' వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. సాధారణంగా ఇలాంటి కాంబినేషన్స్ కి ఓపెనింగ్స్ దద్దరిల్లుతాయి, కానీ ఫ్యామిలీ స్టార్ కి మాత్రం కనీస స్థాయి ఓపెనింగ్ దక్కే అవకాశం లేకపోవడం ట్రేడ్ ని షాక్ కి గురి చేస్తుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడం తప్పనిసరి.

Tags:
Next Story
Share it