GEETHANJALI: ఇంట్రెస్టింగ్ గా “గీతాంజలి "మళ్లీ వచ్చేసింది ట్రైలర్

హారర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి ( GEETHANJALI 2) పార్ట్ 2 వచ్చేస్తుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

GEETHANJALI: ఇంట్రెస్టింగ్ గా “గీతాంజలి మళ్లీ  వచ్చేసింది ట్రైలర్
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అంజలి( ANJALI) ప్రధాన పాత్రలో, శ్రీనివాస్ రెడ్డి( SRINIVAS REDDY) సునీల్( SUNIL) , సత్యం రాజేష్( SATYAM RAJESH) , సత్య శకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో, డైరెక్టర్ శివ తుర్లపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి ( GEETHANJALI 2) పార్ట్ 2 వచ్చేస్తుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండడమే కాదు ఈ కాంభినేషన్ ను మరో సారి స్క్రీన్ మీద చూడడాన్ని మూవీ లవర్స్ ఇష్టపడుతున్నారు.

కామెడీ మరియు హారర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అలరించింది. ఏప్రిల్ 11, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లపై ఎంవీవీ సత్య నారాయణ మరియు GV లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఫస్ట్ పార్ట్ లో అంజలిని డ్యూయల్ రోల్ లో కనిపించారు. అటు దయ్యం పాత్రలోను ఎంతగానో అలరించారు. ఈ అయితే ఈ పార్ట్ లో ఓ మహాల్ బ్యాక్ డ్రాప్ లో..కథ నడుస్తుంది. స్టోరీ హార్రర్ క్రైమ్ స్టోరీలాగా తెలుస్తుంది. ఈ కథ కూడా జనాలకు భలే నవ్విస్తుందంటున్నారు .



Tags:
Next Story
Share it