HANSIKA: '105 మినిట్స్' కథే లేకుండా తీసిన సినిమా !

రీసెంట్ గా హన్సిక కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఆ సినిమానే '105 మినిట్స్'. జనవరి 26వ తేదీన విడుదలైన ఈ సినిమా, రీసెంటుగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది.

HANSIKA: 105 మినిట్స్ కథే లేకుండా తీసిన సినిమా !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనగానే ..నయనతార,త్రిష, ఐశ్వర్యరాజేష్ వీళ్లే గుర్తొస్తారు. కాని రీసెంట్ గా హన్సిక( HANSIKA) కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఆ సినిమానే '105 మినిట్స్'. జనవరి 26వ తేదీన విడుదలైన ఈ సినిమా, రీసెంటుగా 'ఆహా'( AHA) ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఒకే ఒక పాత్రతో .. 6 రోజులోనే షూటింగు పూర్తిచేసుకున్న సినిమా ఇది.

కథ:

జానూ (HANSIKA) ఆఫీసులో తన పని ముగించుకుని ఇంటికి బయల్దేరుతుంది. అప్పటికే బాగా చీకటి పడుతుంది .. వర్షం మొదలవుతుంది. చాలా టెన్షన్ గా కారు నడుపుతూ ఉంటుంది. అలా ఆ భయంలోనే ఇంటికి చేరుకుంటుంది.

ఇంట్లోకి వచ్చిన తరువాత పవర్ పోతుంది. ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అలికిడి అవుతూ ఉంటుంది. ఏవో శబ్దాలు అవుతూ ఉంటాయి. దాంతో ఆమెలో భయం మొదలవుతుంది. ఎవరో వికృతంగా నవుతున్నట్టుగా .. అంతలో మరెవరో ఏడుస్తున్నటుగా వినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ ఇంట్లో నుంచి ఎక్కడో అడవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా . హెల్యూజ్నేషన్ తో భయపడుతూ ఉంటుంది.

ఇంతలో తనకే తెలియకుండా కాళ్లకి గొలుసులు ఎవరు కట్టారో .. ఎలా కట్టారో కూడా ఆమెకి అర్థం కాదు. ఒక గదిలో నుంచి మరో గదిలోకి ఎవరో తనని తరుముతున్నట్టుగా ఆమె నడుస్తూ ఉంటుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తుూ ఉంటుంది ..కాని కుదరదు. ఇంతలో 'నీప్రేమ కావాలి .. నీ కోసం పోయిన నా ప్రాణం కావాలి' అంటూ ఆ అదృశ్య శక్తి ఆమెను వెంటాడుతూ ఉంటుంది.

చాలా తక్కువ సమయంలోనే అదృశ్య శక్తి ( DEVIL) వలన జానూ గాయాల పాలవుతుంది. ఒక వైపు నుంచి ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మరో వైపు నుంచి డోర్ బెల్ మోగుతూ ఉంటుంది. కానీ తీసే అవకాశం ఆమెకి లేకుండా పోతుంది. అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ఆడియన్స్ కు ఇంట్రస్టింగ్ గా మారుతుంది.'105 మినిట్స్' ఒకటి. ఒకే ఒక పాత్ర మాత్రమే తెరపై కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్ర పొందే ఆవేదన .. భయం .. ఆక్రోశం .. ఆందోళన చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. '105 మినిట్స్' అనేది ఈ సినిమా నిడివి. ఈ సమయంలో ఏం జరిగిందనేదే కథ.

కథ మొదలవవ్వడమే ..టెన్షన్ పడుతూ , భయపడుతూ...అసలు ఎవరు, ఎందుకు ఏంటి అనే చిన్న క్లూ కూడా ఇవ్వకుండా కథ ను మొదలుపెట్టడం వల్ల ఎవరు ఎందుకు ఏంటి ఎందుకు చూస్తున్నామనేది ప్రేక్షకుడికి అర్ధంకాదు. పోనీ సినిమా అంతా అయ్యాకైనా ఏమైనా అర్ధమవుతుందా అనుకుంటే అదీ లేదు. పోనీ ఆ ఆత్మ ఎవరిదో ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకుందామా అంటే అసలు కథే చెప్పకుండా దర్శకుడు పార్ట్ 2 కి వెయిట్ చెయ్యమని చెప్పేస్తాడు. అసలు కథే లేదు..సినిమా తీశాడు.

ఈ సినిమా చివర్లో 'ఇలాంటి కష్టం ఏ ఆడపిల్లకు రాకూడదు' అని జానూ అనుకుంటుంది. ఆ డైలాగ్ ను ' ఇలాంటి కష్టం ఏ ప్రేక్షకుడికి రాకూడదు' అని మార్చుకోవచ్చు. సినిమా పార్ట్ 2 కోసం ప్లాన్ చేసుకున్నపుడు ఇప్పుడు మాత్రం సినిమా లో స్టోరీ లేదు.

Tags:
Next Story
Share it