HBD Raghavendra Rao: దర్శకేంద్రుడి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీ లో దర్శకేంద్రుడి గా పేరు తెచ్చుకొని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఏర్పాటు

HBD Raghavendra Rao: దర్శకేంద్రుడి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
X

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీ లో దర్శకేంద్రుడి గా పేరు తెచ్చుకొని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఏర్పాటు చేసుకున్నారు రాఘవేంద్ర రావుతెలుగు సినీ ఇండస్ట్రీ లో దర్శకేంద్రుడి గా పేరు తెచ్చుకొని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఏర్పాటు చేసుకున్నారు రాఘవేంద్ర రావు(Raghavendra Rao) . అయితే అలాంటి ఈ లెజెండరీ డైరెక్టర్ తాజాగా తన 82వ పుట్టినరోజునే జరుపుకుంటున్నారు.ఈయన బర్త్డే సందర్భంగా ఎంతో మంది సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి బర్త్ డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు. అయితే అలాంటి లెజెండరీ డైరెక్టర్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం..

రాఘవేంద్రరావు(Raghavendra Rao) మొదట ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాబు అనే మూవీ తో..ఈ సినిమాలో శోభన్ బాబు (Sobhan babu) హీరోగా చేశారు. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఈయన హీరోయిన్ల గ్లామర్ ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో దిట్ట.అలా ఎంతో మంది హీరోయిన్లను ఈయన స్టార్లుగా చేశారు. ఇక రాఘవేంద్రరావుకి భక్తి రస సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈయన దర్శకత్వంలో శ్రీరామదాసు(Sri Ramadasu) , అన్నమయ్య, శిరిడి సాయి వంటి సినిమాలు వచ్చాయి. ఇక రాఘవేంద్రరావుకి ఏప్రిల్ 28 ఒక ప్రత్యేకమైన రోజట. ఎందుకంటే ఈ రోజునే ఆయన సీనియర్ ఎన్టీఆర్ తో అడవి రాముడు అనే మూవీని రిలీజ్ చేశారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో అప్పటినుంచి రాఘవేంద్రరావుకి ఏప్రిల్ 28 ఒక స్పెషల్ డే గా ఆయన జీవితంలో మిగిలిపోయింది.

అంతేకాకుండా రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన బాహుబలి 2(Bahubali 2) మూవీ ఏప్రిల్ 28న విడుదలై భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా క్రియేట్ చేయని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక రాఘవేంద్రరావుకి 8 నంది పురస్కారాలు,5 ఫిలిం ఫేర్ సౌత్ పురస్కారాలు,IIFA పురస్కారం ఒకటి,అలాగే ఒక సైమా అవార్డు, రెండు సినీ మా అవార్డులు వచ్చాయి.రాఘవేంద్రరావు కేవలం సినిమాలకు మాత్రమే కాకుండా బుల్లితెర మీద ఒకప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన శాంతినివాసం (Shanti nivasam) అనే సీరియల్ కి రచయితగా,దర్శక పర్యవేక్షకుడిగా కూడా చేశారు. అలాగే స్టార్ హీరోలైన వెంకటేష్,అల్లు అర్జున్,మహేష్ బాబు వంటి హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ కూడా ఈయనే.ఇక సీనియర్ ఎన్టీఆర్ చివరి సినిమా కూడా రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో రావడం విశేషం. అలాంటి ఈ లెజెండరీ డైరెక్టర్ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని న్యూస్ లైన్ కోరుకుంటుంది.

Tags:
Next Story
Share it