Rajinikanth Biopic : తెరపైకి రజినీకాంత్ బయోపిక్..హీరో ఎవరంటే!

ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి ఇండియా లోనే నెంబర్ 1 స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ జీవితం ప్రతీ సామాన్యుడికి ఒక ఆదర్శం.

Rajinikanth Biopic : తెరపైకి రజినీకాంత్ బయోపిక్..హీరో ఎవరంటే!
X

న్యూస్ లైన్ డెస్క్: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి ఇండియా లోనే నెంబర్ 1 స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ జీవితం ప్రతీ సామాన్యుడికి ఒక ఆదర్శం. ఏ వ్యక్తి అయినా ఎంచుకున్న రంగాలలో రాణించాలంటే రజినీకాంత్ లాంటి వ్యక్తుల్ని రోల్ మోడల్ గా తీసుకోవడం అత్యవసరం. కెరీర్ లో ఆయన నిలదొక్కుకున్న విధానం, దానికి కోసం ఆయన పడిన కస్టాలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి లెజెండ్ జీవిత చరిత్ర ఇండియా లో ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాల్సిందే. ప్రస్తుతం నడుస్తున్న బయోపిక్ ట్రెండ్ లో అతి త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని సినిమా తియ్యబోతున్నారు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా. ఈ చిత్రం లో రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ హీరో గా నటిస్తారని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుంది. ఇటీవలే రజినీకాంత్ తో దిగిన ఫోటోని సాజిద్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ 'లెజండరీ బయోపిక్ మూవీ కోసం పని చెయ్యడం నాకు దక్కిన గౌరవం గా భావిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it