Meera Jasmine : ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ కి పితృవియోగం!

భద్ర, గుడుంబా శంకర్, పందెం కోడి ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మీరా జాస్మిన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.

Meera Jasmine : ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ కి పితృవియోగం!
X

న్యూస్ లైన్ డెస్క్ : భద్ర, గుడుంబా శంకర్, పందెం కోడి ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మీరా జాస్మిన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. పెళ్లి అయ్యాక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి దుమ్ము లేపుతుంది. కెరీర్ మళ్ళీ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది అని ఆనందం లో ఉన్న ఆమెకి ఇప్పుడు తీవ్రమైన విషాదం లో మునిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) నేడు అనారోగ్యం తో కేరళలోని ఎర్నాకులం లో కన్నుమూశారు. జోసెఫ్, అళియమ్మ దంపతులకు ఐదుగురు పిల్లలు కాగా, మీరాజాస్మిన్ అందరికంటే చిన్నవారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి ఇప్పటి వరకు ఈమె 50 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు లో ఈమె చివరిసారిగా కనిపించిన చిత్రం విమానం.

Tags:
Next Story
Share it