Nivetha Thomas: పెళ్లి పీటలెక్కబోతున్న నాని హీరోయిన్..!!

తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు సాధించిన నివేదా థామస్ ఈమధ్య కాలంలో చాలా బరువు పెరిగిపోవడం వల్ల సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఇక నివేదా

Nivetha Thomas: పెళ్లి పీటలెక్కబోతున్న నాని హీరోయిన్..!!
X

న్యూస్ లైన్ డెస్క్: తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు సాధించిన నివేదా థామస్(Nivetha Thomas) ఈమధ్య కాలంలో చాలా బరువు పెరిగిపోవడం వల్ల సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఇక నివేదా థామస్సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ మూవీ వెరుథె ఒరు భార్య తో.. ఈ సినిమాలో నివేదా థామస్ నటనకి విమర్శకుల నుండి సైతం ప్రశంసలు వచ్చాయి.

అంతేకాదు ఈ సినిమాలోని నివేదా థామస్ నటనకి కేరళ రాష్ట్రం ఉత్తమ యువ నటి అవార్డును సైతం ఈమెకు అందించింది.అలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో నాని(Nani) హీరోగా చేసిన జెంటిల్ మెన్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా నిన్ను కోరి(Ninnu Kori) , జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, దర్బార్, షాకిని డాకిని, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్,వి, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరమైపోయింది.బరువు పెరిగిపోవడం కారణంగా అవకాశాలు కూడా రావడం లేదు. అంతేకాదు ప్రస్తుతం నివేదా థామస్ ఫొటోస్ చూసిన వాళ్లు కూడా ఈ హీరోయిన్ ఇంత లావైపోయింది ఏంటి అని షాక్ అవుతున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న నివేదా థామస్ కి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట.ఇక అవకాశాలు కూడా లేకపోవడంతో నివేదా థామస్ (Nivetha Thomas) కూడా ఇంట్లో వాళ్లకి ఎదురు చెప్పలేక తన దూరపు బంధువు అయిన వరుసకి బావ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట.అయితే ఈ విషయానికి సంబంధించి నివేద థామస్ ఇప్పటివరకైతే అఫీషియల్ గా ఈ న్యూస్ బయటపెట్టలేదు. మరి చూడాలి నివేదా థామస్ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా లేదా అనేది..

Tags:
Next Story
Share it