RAJ MOULI: రాజమౌళి సినిమాలో మహేష్ కు జంటగా ..ఇండోనేషియా న‌టి

రాజమౌళి , మహేష్ బాబు చేస్తున్న సినిమాలో మహేష్ బాబు కు జంటగా ఓ ఇండోనేషియన్ ( INDONESIAN BEAUTY) బ్యూటీ నటిస్తుందట.

RAJ MOULI: రాజమౌళి  సినిమాలో మహేష్ కు జంటగా ..ఇండోనేషియా న‌టి
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : RRRతో రాజమౌళి ( RAJ MOULI) నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేస్తున్నారు. ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. అఫిషియల్ కాదనుకొండి..చాలా ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రిన్స్ మహేష్ బాబు కు జంటగా ఓ ఇండోనేషియన్ ( INDONESIAN BEAUTY) బ్యూటీ నటిస్తుందట. దర్శకధీరుడు రాజామౌళి, మ‌హేష్‌బాబు కాంబినేషన్‌లో వ‌స్తున్న సినిమాలో ఇండోనేషియా బ్యూటీని తీసుకుంటున్న‌ట్లు టాక్.

కొన్ని రోజుల్లో ఈ మూవీ పట్టాలెక్కబోతుంది. రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఇప్పటికే ఈ సినిమా ఆ కోసం కథను కూడా సిద్ధం చేసేశార‌ట‌. ఈ చిత్రంలో హాలీవుడ్ నటి మ‌హేష్‌కు జోడిగా నటిస్తున్నారని కూడా టీ టౌన్ వ‌ర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. ఆమె ఎవ‌రో కాదు. ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్. మహేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం పాన్‌ వరల్డ్‌ స్థాయిలో రూపోందబోతుంది.

అయితే, ఈ విష‌యంపై ఇటు మ‌హేష్ కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించ‌లేదు. కాని ప్రచారం మాత్రం చాలా జోరుగా నడుస్తుంది. ఇండోనేషియా బ్యూటీ చెల్సియా జ‌కార్తాలో త‌న స్ట‌డీస్ పూర్తిచేసింది. 2013లో హాలీవుడ్ ఫిల్మ్ రిఫ్రైన్‌ తో సినీ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత 'స్ట్రీట్‌ సొసైటీ', 'హెడ్‌షాట్‌', 'మే ది డెవిల్‌ టేక్‌ యు' మంచి ఫేమ్ వచ్చిన సినిమా లు చేసి సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

Tags:
Next Story
Share it