Kajal: కాజల్ పై భర్తకి అనుమానమా.. వాళ్లకి ఫోన్ చేసి ఆ విషయం అడుగుతాడా..?

సౌత్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పై తన భర్తకు నమ్మకం లేదా.. నమ్మకం లేకనే కాజల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తన మేనేజర్ కి మేకప్ మెన్ కి ఫోన్లు చేస్తాడా..అయితే ఇందులో అసలు

Kajal: కాజల్ పై భర్తకి అనుమానమా.. వాళ్లకి ఫోన్ చేసి ఆ విషయం అడుగుతాడా..?
X

న్యూస్ లైన్ డెస్క్: సౌత్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal agarwal) పై తన భర్తకు నమ్మకం లేదా.. నమ్మకం లేకనే కాజల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తన మేనేజర్ కి మేకప్ మెన్ కి ఫోన్లు చేస్తాడా..అయితే ఇందులో అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ (Sathyabhama) అనే మూవీతో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా మే 31న విడుదలవబోతుండగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో సినిమాలకు సంబంధించిన అలాగే పర్సనల్ విషయాలు చెబుతుంది.

ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కాజల్ (Kajal ) మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీ లో పెళ్లైన హీరోయిన్లకు ఇచ్చినన్ని చాన్స్ లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవ్వడం లేదు. బాలీవుడ్లో హీరోయిన్లకు పెళ్లయినా కూడా వరుస అవకాశాలు వస్తాయి.కానీ టాలీవుడ్లో హీరోయిన్లకు పెళ్లిళ్లు అవుతే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వరు. కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఇక నేను సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తాను. అలాగే నా భర్త గౌతమ్ (Gautham) కూడా ఆయనకి సమయం దొరికినప్పుడల్లా నేను చేసే సినిమా షూటింగ్ సెట్ కి వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు.ఇక నేను బయట షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ చేసి ఇంటికి సంబంధించిన విషయాలు అలాగే నా వివరాలు అడిగి తెలుసుకుంటారు.

ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా మేనేజర్ కి లేకపోతే నా మేకప్ మీన్ కి ఫోన్ చేసి ఆయన ఏ విషయం చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని చెబుతారు. ఇక నేను పెళ్లయ్యాక సినిమాల్లో నటిస్తానని చెప్పిన సమయంలో నా భర్త నా అత్తింటి వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా నా భర్త నా సినిమాల విషయంలో ఎంతగానో సపోర్ట్ చేస్తారు.. అంటూ కాజల్ అగర్వాల్ (Kajal agarwal) ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.అయితే కాజల్ చెప్పిన మాటలకు కొంతమంది ఆకతాయిలు కాజల్ పై గౌతమ్ కి నమ్మకం లేదా.. అందుకే అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మేకప్ మెన్ కి మేనేజర్ కి ఫోన్ చేసి తెలుసుకుంటాడా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు

Tags:
Next Story
Share it